Beauty Tips : ముఖంపై ముడతలా.. అయితే ఇలా చెక్ పెట్టండి..!!

Beauty Tips : ఇటీవల కాలంలో వాతావరణంలో మార్పులు.. తీసుకునే ఆహారంలో కలుషితం.. ఇలా ఎందులో చూసినా అంతా కలుషితమై కనిపిస్తుంది కాబట్టి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు ఏర్పడుతున్నాయి . అలాగే అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. ఇకపోతే జీవనవిధానంలో మార్పులు వచ్చినా సరే శరీరంలో మార్పులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి .. ఇవన్నీ ముడతలు తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి కొంచెం ఆలస్యం అయినా సరే వంటింటి చిట్కాలను పాటిస్తే ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది. ఎవరైనా సరే ముడతల సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే ఈ ఆర్టికల్ను వారికి వాట్సప్ ద్వారా షేర్ చేయండి.

ముఖ్యంగా ముడతలను పోగొట్టడానికి బాదం నూనె చాలా చక్కగా పనిచేస్తుంది. ముఖానికి సంబంధించిన అన్ని సమస్యలను బాదం నూనెతో చెక్ పెట్టవచ్చు. బాదం నూనెలో విటమిన్ ఏ, విటమిన్ ఈ, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అలాగే జింక్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. ఇన్ని పోషకాలు అధికంగా ఉండే బాదం నూనెను ముఖానికి ప్రతి రోజూ అప్లై చేయడం వల్ల పాత మచ్చలు తొలగిపోతాయి. అంతేకాదు చర్మరంధ్రాలు ఓపెన్ అయి అందులో ఉండే దుమ్ము , ధూళి శుభ్రం అవుతుంది.

Beauty Tips home remedies to reduce wrinkles on face pmwsy
Beauty Tips home remedies to reduce wrinkles on face pmwsy

ఇక బాదం నూనె ను ప్రతిరోజు ఉపయోగించడం వల్ల చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తుంది. అలాగే ఎన్నో రకాల చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో చాలా చక్కగా సహాయపడుతుంది. కాబట్టి ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల బాదం నూనె తీసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి.. చర్మ సంరక్షణలో భాగంగా ఈ నూనెను ఉపయోగించడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తొలగించి , ముడతలను దూరం చేస్తాయి.