మీ ఇంటి గుమ్మానికి ఇలాంటి ఫోటోలు పెడుతున్నారా..?

ఇల్లు స్వర్గం లాంటిది.. అలాంటి ఇంటి వల్ల అంతా మంచే జరగాలి కాని ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఆందోళన కలగకూడదు.. సమస్యలు రాకూడదు. ఇకపోతే కష్టాలకు, సమస్యలకు కారణం వాస్తు మాత్రమే కాదు.. మనం చేసే కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు వాస్తు శాస్త్ర పండితులు. నిజానికి వాస్తు శాస్త్రం గురించి పట్టింపు లేని వారికి ఎలాంటి బాధా లేదు.. కానీ పట్టింపు ఉండే వారు మాత్రం ఇంటి పునాది మొదలు కొని ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు ఆ ఇంట్లో ప్రతి అణువణువు వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించుకుంటారు. ఇక ఇలా వాస్తు పట్టింపులు ఎక్కువగా ఉండేవారు కొన్ని వాస్తు నియమాలను పాటించాల్సి ఉంటుంది.

Advertisement

ముఖ్యంగా ఇంటి ముఖ ద్వారానికి ఎదురుగా మరణించిన పెద్దల ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అమర్చకూడదు. వినాయకుడి ఫోటో లు గుమ్మానికి ఎదురుగా పెడితే అంతా శుభమే జరుగుతుంది. ఇక చాలామంది ఇంటి గోడలు కట్టేటప్పుడు తాపీ మేస్త్రీలు.. పై పనులు చేసుకోవడం కోసం సపోర్ట్ కర్రలు చేసే సమయంలో కన్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక వాయువ్యం పెరిగినా లేదా వాయువ్యంలో ఇంకా ఏమైనా దోషాలు ఉంటే వెంటనే హనుమంతుడి ఫొటోను ఆ ప్లేస్లో ఉంచి పూజిస్తే దోషం తీవ్రత తగ్గుతుంది.బీరువాలు నైరుతి నుంచి ఉత్తరానికి తెరిచినట్లు ఉండేలా ఉంచాలి. ఇక తూర్పు, ఉత్తర ప్రహరీ గోడలపై పూల చెట్లను పెంచకూడదు.

Advertisement
Do you put such photos on the porch of your house
Do you put such photos on the porch of your house

ఇక వీధిపోటు విషయానికొస్తే తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, పడమర వాయువ్యం, దక్షిణ ఆగ్నేయం ఈ నాలుగు వైపులా వీధిపోటు మంచివే కాని తూర్పు ఆగ్నేయం, పడమర నైరుతి, ఉత్తర వాయవ్యం,దక్షిణ నైరుతి వీధిపోట్లు ఇంటికి మంచిది కాదు. ఇక మీ ఇంటి పడమట వైపు స్థలం కొనుక్కుంటే మీ భార్యకు అనారోగ్యం అలాగే నష్టం వాటిల్లుతుంది.దేవాలయాల నీడ,గజ స్థంభం నీడ పడే స్థలంలో మీ ఇంటిని నిర్మించకూడదు. ఇక పాములు పుట్ట ఉండే స్థలాన్ని అసలు కొనుగోలు చేయరాదు. ఇలా చేస్తే ఆ ఇంట్లో పుట్టే పిల్లలు అంగవైకల్యంతో కానీ అనారోగ్యంతో కానీ పుడతారు. ఇలాంటి జాగ్రత్తలు ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఈ ఆర్టికల్ ను వాట్స్అప్ ద్వారా అందరికీ షేర్ చేయండి.

Advertisement