Sorakaya Swami : కోరికలు తీర్చే సొరకాయ స్వామి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

Sorakaya Swami : వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది కదూ.. ఆంధ్ర – తమిళనాడు సరిహద్దుల్లో సొరకాయ స్వామి ఆలయం వెలసింది.. ఇక్కడ స్వామివారు భక్తులు కోరిన కోరికలను తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందారు.. ఏ దేవుడికైనా కోరిన కోరికలు నెరవేరితే బంగారు, వెండి ,పట్టు వస్త్రాలను సమర్పిస్తారు భక్తులు.. కానీ ఇక్కడ దేవాలయంలో మాత్రం కేవలం సొరకాయను స్వామి వారికి సమర్పిస్తే చాలు కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ మా కోరిక నెరవేరితే మీకు కానుకగా బంగారు ఆభరణాలు ఇస్తామని కోరుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు.. మన కోరికలు నెరవేరిన తర్వాత సొరకాయలను స్వామి వారికి సమర్పిస్తే స్వామి ప్రసన్నుడౌతాడని ఇక్కడ చరిత్ర చెబుతోంది.

తిరుపతి జిల్లాలోని ఆంధ్ర – తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న నారాయణవనంలో సొరకాయల స్వామి ఆలయం వెలసింది. చెన్నై , పుత్తూరు పరిసరాలను సందర్శిస్తూ ఒక స్వామి చివరిగా శ్రీవారి దర్శనార్థం కోసం తిరుపతికి వచ్చారట. ఏడుకొండల వారిని దర్శించుకొని వెళుతున్న సమయంలో ఆయనకు నారాయణవనం కనిపించిందట. అక్కడ పరిసరాలు.. ప్రకృతి ఎంతగానో నచ్చి శ్రీమన్నారాయణుని స్మరిస్తూ ఇక్కడే నిత్యం ధ్యానం లో ఉండేవారట . అయితే ఆ స్వామి భుజాన ఎప్పుడూ సొరకాయ వేలాడుతూ ఉండేదట.ఇక ఎప్పుడైనా భక్తులు అనారోగ్యంతో తన దగ్గరకు వస్తే తన భుజాన ఉన్న సొరకాయ నుంచి ఔషధాలు అందించి భక్తులను ఆశీర్వదించేవారు స్వామి.

Do you know these things about Sorakaya Swami who fulfills desires
Do you know these things about Sorakaya Swami who fulfills desires

ఇక స్వామి వారు అందించిన ఔషధం తీసుకున్న వెంటనే ప్రతి ఒక్కరికి ఎంతటి హానికరమైన రోగమైన సరే ఇట్టే నయమయ్యే దట. ఇక ఈ విషయం కాస్త కొన్ని రోజులకు చుట్టుపక్కల గ్రామాలకు అక్కడ ఇక్కడ పాకి స్వామి వారి దగ్గరికి వచ్చే భక్తుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగి పోయిందట. ఈ స్వామి రెండు వందల ఏళ్ళ పైగా జీవించినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.స్వామి గుర్తుగా ఆయన జీవ సమాధి అక్కడ చేసినట్టు ..ఇక అక్కడే ఆలయాన్ని కూడా నిర్మించినట్లు సమాచారం. ఇక ఈ ఆలయానికి భక్తులు వస్తే తప్పకుండా సొరకాయను మొక్కుగా సమర్పించుకోవడం ఆనవాయితీ గా మారిందట. ముఖ్యంగా మనం స్వామి వారికి కోరికలు కోరితే అప్పుడు సొరకాయలు కట్టి, ఆ కోరికలు నెరవేరిన తరువాత స్వామివారికి సొరకాయల ను సమర్పిస్తే స్వామి ప్రసన్నుడు అవుతాడట.