Gastric Problem : గ్యాస్ట్రిక్ సమస్య అధికం అవుతోందా..?

Gastric Problem : సాధారణంగా మనం తీసుకునే ఆహారం.. సమయానికి తినకపోవడం లేదా ఇతర కారణాల వల్ల చాలామంది పలు ఉదర సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటిలో ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్య కూడా ఒకటి. చాలామంది రాత్రిపూట కడుపులో గ్యాస్ ఏర్పడటం , కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నామని వైద్యుల దగ్గరకు వెళ్తున్నారు.
ఇక పొట్టలో గ్యాస్ కారణంగా కడుపు నొప్పి పెరుగుతుంది.. ఇలాంటి పరిస్థితులలో రాత్రివేళ మాత్రమే ఎందుకు కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది అనే విషయం కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఇక మీకు తెలిసిన వారు

ఎవరైనా సరే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లైతే వారికి ఈ ఆర్టికల్ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.ముఖ్యంగా ఆహారం తిన్న తర్వాత దానిని జీర్ణం చేసే పని ప్రారంభమైనప్పుడు కడుపులో గ్యాస్ వేగంగా ఏర్పడుతుంది. జీర్ణక్రియ ప్రక్రియ సరిగా జరగక పోయినా లేదా భారీగా ఆహారాన్ని తీసుకున్న మరింత గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే రాత్రి సమయంలో ఆహారం ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే గ్యాస్ ఏర్పడే ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండటం ఎంతో అవసరం. ఇక ఆరోగ్యకరమైన మంచి బ్యాక్టీరియా ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేయడానికి సుమారుగా 6 గంటల సమయం పడుతుంది.

Home remedies for gastric problem
Home remedies for gastric problem

మధ్యాహ్నం భోజనం తో సహా గత ఆరు గంటల్లో మీరు ఏది ఉన్నా సరే కడుపులో గ్యాస్ ఏర్పడవచ్చు.కాబట్టి రాత్రి సమయంలో ఎంత తేలిక ఉన్న ఆహారం అంత తీసుకుంటే మీకే మంచిది.ఇకపోతే రాత్రి పూట గ్యాస్ ఏర్పడడానికి అధిక ఫైబర్ కూడా కారణం అవుతుంది. కాబట్టి రాత్రి భోజనం చేసేటప్పుడు బఠాణీలు , పండ్లు , బీన్స్ , కూరగాయలు , తృణధాన్యాలు వంటివి తీసుకోకూడదు. ఇక పరిహారం ఏమిటి అంటే రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత సుమారు 20 నిమిషాల పాటు అటూ ఇటూ నడవాలి. రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీటిని తాగాలి. భోజనం చేయడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయట పడవచ్చు.