Credit Card : క్రెడిట్ కార్డు ఉపయోగించే వారికి శుభవార్త..!

Credit Card : సాధారణంగా బ్యాంకు ఖాతా కలిగిన చాలామంది డెబిట్ కార్డులు మాత్రమే ఉపయోగిస్తారు. కానీ ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం కూడా ఎక్కువ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా క్రెడిట్ కార్డు ఉపయోగించే వారికి కూడా 35 వేల రూపాయల వరకు డిస్కౌంట్ పొందే అవకాశాన్ని బ్యాంకులు కలిగించడం జరిగింది. ఇక ఎవరైతే సమ్మర్ వెకేషన్ కు ప్లాన్ చేసుకుంటున్నారో అలాంటి వారికి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు. ఫ్లైట్ టికెట్ బుకింగ్ , హోటల్ బుకింగ్ వంటివాటిపై తగ్గింపు పొందేందుకు క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఈ అవకాశం ఉంటుందట.ఎవరైతే అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారు వారికి సూపర్ ఆఫర్ అందుబాటులో ఉన్నాయి.. ఇక ఇలాంటి కార్డు గనుక మీ దగ్గర ఉంటే ట్రావెల్ సమయంలో డబ్బు కూడా ఆదా అవుతుంది.

బ్యాంకు తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు సుమారుగా రెండు వేల రూపాయల నుంచి 35 వేల రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాలను అందివ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ ఆఫర్ లు ఎలా ఉన్నాయి.. వీటిని ఎలా పొందాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పటికీ మీ స్నేహితులు లేదా బంధుమిత్రులు ఎవరైనా సరే ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నట్లయితే వారికి ఈ ఆర్టికల్ ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.ఇక మేక్ మై ట్రిప్ లో అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ ద్వారా బుకింగ్ చేసుకున్నట్లయితే డబ్బు కూడా ఆదా అవుతుంది. డొమెస్టిక్ ఫ్లైట్ పై 15 శాతం వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. ఇక డొమెస్టిక్ హోటల్స్ బుకింగ్ పై కూడా 15 శాతం రాయితీ లేదా ఐదు వేల రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది.

Good news for credit card users
Good news for credit card users

ఇందుకోసం MMTAMEX అనే ప్రోమో కోడ్ ను ఉపయోగించవచ్చు . ఇక జూన్ 25 వరకు ఈ ఆఫర్లు మనకు అందుబాటులో ఉంటాయి. విదేశీయానం కోసం విమాన టికెట్లు క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే పది శాతం తగ్గింపు.. గరిష్ఠంగా రూ.పదివేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.అంతర్జాతీయ హోటల్ బుకింగ్ 15 శాతం వరకూ ఉంది. ఇక గరిష్ఠంగా రూ.35 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇందుకోసం MMTAMEXINT ప్రోమో కోడ్ ను ఉపయోగించవచ్చు. ఇక జూన్ 24 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఎంపిక చేసిన ఇంటర్నేషనల్ డొమెస్టిక్ హోటల్ కు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. కాదు క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఒక సారి మాత్రమే బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది అలాగే శనివారం రోజు మాత్రమే ఫ్లైట్స్ , హోటల్స్ బుకింగ్ చేసుకోవచ్చు.