Money : ఈ కార్డ్ తో రూ. లక్ష రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఎలా అంటే..?

Money : టీవీఎస్ ఇన్స్టా కార్డు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? ఈ కార్డు మీ వద్ద ఉంటే లక్ష రూపాయలు ప్రీ అప్రూవ్డ్ లోన్ మీరు ఎప్పుడైనా పొందవచ్చు . అయితే అది ఎలా అని అనుకుంటున్నారా.. ఇక ఈ విషయం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. టీవీఎస్ క్రెడిట్ ఇన్స్ట కార్డు ద్వారా సులభంగా మీరు లక్ష రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ కార్డును ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ లకు కూడా ఉపయోగించుకోవచ్చు.

అంతేకాదు రోజువారీ ఖర్చులు , ట్రావెల్, హెల్త్, ఫర్నిచర్, రెంట్, ఎడ్యుకేషన్ ఫీజు ఇలా ఎటువంటి అవసరాలు ఉన్నా సరే ఈ కార్డు ద్వారా మీరు మీ అవసరాలను తీర్చుకోవచ్చు.డీమార్ట్, స్మార్ట్ బజార్, షాపర్స్ స్టాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మ్యాక్ ఫ్యాషన్ ఇలా ఎక్కడైనా ఈ టీవీఎస్ క్రెడిట్ ఇన్స్టా కార్డు ద్వారా షాపింగ్ చేయొచ్చు. జీరో కాస్ట్ ఈఎంఐ, జీరో ప్రాసెసింగ్ ఫీజు వంటి ప్రయోజనాలు పొందొచ్చు. అంతేకాదు ఈ కార్డు కొనుగోలు చేసిన తర్వాత మీరు కార్డు ద్వారా ఏదైనా వస్తువు లను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే వాటిని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు.

Money With this card Rs. How to get a loan of up to Rs 1 lakh
Money With this card Rs. How to get a loan of up to Rs 1 lakh

ఫ్లైట్ టికెట్ బుకింగ్, హోటల్ బుకింగ్ వంటివి కూడా చేసుకోవచ్చు. ఇంట్లోకి అవసరమైన హోమ్ అప్లయెన్సెన్స్ కొనవచ్చు.ఇలా ఈ కార్డు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే కార్డు లిమిట్‌ ద్వారా లోన్ కూడా పొందొచ్చు.టీవీఎస్ క్రెడిట్ ఇన్‌స్టా కార్డు పొందాలంటే రూ.444 చెల్లించాలి. కార్డు జారీ కోసం దీన్ని వన్‌ టైమ్ ఫీజు కింద వసూలు చేస్తున్నారు. ఈఎంఐ వడ్డీ రేటు నెలకు 2 శాతంగా ఉంటుంది. కార్డు ద్వారా ఒకేసారి రూ.3 నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయవచ్చు. ముందు ఈ కార్డును వర్చువల్‌గా యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత 28 రోజులకు ఫిజికల్ కార్డు డెలివరీ అవుతుంది.