Hanuman : ఈరోజు హనుమాన్ కి వీటిని నైవేద్యంగా సమర్పిస్తే.. కష్టాలని పరార్..!!

Hanuman : ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రోజు అని చెప్పవచ్చు. ఇలాంటి పవిత్రమైన రోజున స్వామి వారిని మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే కొన్ని రకాల ప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక ఇలా ఈ రోజు స్వామివారికి ఎలాంటి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల స్వామివారు ప్రసన్నుడై మనపైన ఆయన దయ ఉంచుతారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి కాబట్టి వారు ఆ కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఈ ఆర్టికల్ ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది.

కాబట్టి కష్టాల్లో ఉన్న వారికి ఈ ఆర్టికల్ వాట్స్అప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.ఇక స్వామివారికి నైవేద్యంగా సమర్పించే వాటిలో మోతిచూర్ లడ్డూ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఇక వీటితో పాటు లడ్డూలను కూడా స్వామి వారికి ఇష్టమైన రంగు తో తయారు చేయాలి. స్వామివారికి మోతిచూర్ లడ్డూ లను తయారు చేసి నైవేద్యంగా పెడితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జిలేబీలను కూడా స్వామివారికి సమర్పించడం వల్ల జీవితంలో ఎదుర్కొంటున్న అనేక కష్టాలను , సమస్యలను దూరం చేసుకోవచ్చు.

If these are offered as an offering to Hanuman today
If these are offered as an offering to Hanuman today

స్వామివారికి నైవేద్యం ఉదయం సమర్పించ లేనివారు సాయంత్రం సమయంలో తల స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి హనుమంతుడి పూజ లో జిలేబీలను నైవేద్యంగా ఇవ్వాలి.కేసర్ వాలే భాత్ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి నైవేద్యం సమర్పిస్తే అంగారక దోషం పోతుందట. అయితే దీనిని కుంకుమ పువ్వు తో తయారు చేస్తారు కాబట్టి అంగారక దోషం ఉన్నవారు ఈ కేసర్ ని ప్రత్యేకంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. జీవితంలో కష్టాలు తొలగిపోవాలి అంటే స్వామి వారికి స్వీట్ పాన్ ప్రసాదంగా పెట్టాలని శాస్త్రం చెబుతోంది. హనుమాన్ కి స్వీట్ పాన్ నైవేద్యంగా ప్రసాదిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.