Jio Customers : జియో కస్టమర్లకు శుభవార్త.. ఫ్రీ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్ స్టార్.!!

Jio Customers : దేశంలో దిగ్గజ టెలికాం సంస్థలలో ఒకటైన జియో తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. మిగతా టెలికాం దిగ్గజ సంస్థలతో పోలిస్తే రిలయన్స్ జియో కస్టమర్లను ఆకర్షించడంలో ఎప్పుడూ ముందుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోని తమ కష్టమర్లను మరింత ఆనందింప చేయడానికి సరికొత్త ఆఫర్ ను తీసుకు వచ్చింది. ఆ ఆఫర్ ఏమిటి అనే విషయాలను కూడా ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.. రిలయన్స్ జియో తీసుకొచ్చిన ఆఫర్ విషయానికి వస్తే..

జియో కస్టమర్లకు ఉచిత నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాక్సెస్ తెచ్చే బెస్ట్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఇక ఈ ప్లాన్స్ కేవలం నెట్ ఫ్లిక్స్ కి మాత్రమే కాదు అమెజాన్ ప్రైమ్ వీడియో , డిస్నీ + హాట్ స్టార్ కూడా ఉచితంగా యాక్సిస్ చేసుకోవడానికి జియో ఆఫర్ ప్రకటించడం గమనార్హం. ఇకపోతే జియో కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఉచిత యాక్సెస్ అందించే బెస్ట్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Good news for jio customers Netflix , Amazon prime video, Disney play star free
Good news for jio customers Netflix , Amazon prime video, Disney play star free

రూ.399 జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్ : జియో అందిస్తున్న ఈ ప్లాన్ ఒక నెల రెంటల్ ప్లాన్ అలాగే బిల్ వ్యవధి కి గాను 75జిబి హై స్పీడ్ డేటాను కూడా అందిస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందవచ్చు. అలాగే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ , డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా పొందుతారు. ఇక అంతేకాదు రోజువారి 200జిబి వరకు డేటాని రోల్ అవుట్ చేసుకోవచ్చు. ఇదే లాభాలను ఆఫర్ చేసే మరొక రెండు ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి..

ఫ్యామిలీ ప్లాన్స్.. ఈ ప్లాన్స్ మీకు అదనపు సిమ్ కార్డును కూడా అందిస్తాయి. అందులో ఒకటి 599 పోస్ట్ పెయిడ్ ప్లాన్.. ఈ ప్లాన్ తో పాటు ఒక సిమ్ కార్డు ఉచితంగా వస్తుంది. ఇంకొకటి 799 పోస్ట్ పెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తో రెండు సిమ్ కార్డులు వస్తాయి. అయితే ఇక్కడ అందించిన ప్లాన్ ధరలకు జీఎస్టీ ని కూడా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక మొత్తానికి జియో ప్రకటించిన ఈ ఆఫర్లను చూసి తమ కస్టమర్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనితో తప్పకుండా జియో సబ్స్క్రిప్షన్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది అని రిలయన్స్ జియో ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం.