Electric Scooter : ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో చాలా బైక్ తయారీ కంపెనీలు ఒకదానికొకటి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కస్టమర్లను ఆకర్షించడానికి ప్రతి ఒక్క వాహన తయారీ కంపెనీ సరికొత్త ఫీచర్లతో తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెడుతుంటే మరికొన్ని కంపెనీలు మాత్రం మరింత కస్టమర్లను ఆకర్షించడానికి ధరను కూడా తగ్గిస్తూ కస్టమర్లకు షాక్ ను కలిగిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం డీజిల్ , పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్నో రకాల బైకులు స్కూటర్లు కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాటిని కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపు. ఇకపోతే అతి తక్కువ ధరకే లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు ఒకసారి చదువు తెలుసుకుందాం.
అవన్ ట్రెండ్ ఈ : ఇక ఈ స్కూటర్ మనకు రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి సింగిల్ బ్యాటరీ ప్యాక్ అయితే మరొకటి డబుల్ బ్యాటరీ ప్యాక్.. ఇక దీని ధర రూ.56,900 నుండి మొదలవుతుంది.. ఇక సింగిల్ బ్యాటరీతో నడిచే వేరియంట్ 60 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటే డబుల్ బ్యాటరీతో నడిచే వేరియంట్ 110 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఈ రెండు వేరియంట్ ల గరిష్ట వేగం 45 కిలోమీటర్ పర్ అవర్ కాగా గరిష్ట పే లోడ్ 150 కేజీలుగా నిర్ణయించబడింది.
హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ : ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి నిలిపివేయబడినా ఇది మాత్రం అత్యంత చౌక ధరకే భారత మార్కెట్లో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇకపోతే ముఖ్యంగా చైనా నుండి వచ్చే విడిభాగాలను దేశంలోకి దిగుమతి చేసుకోవడానికి ప్రస్తుతం అనుమతించని నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ ఫ్లాష్ స్కూటర్ రావడానికి సమయం పడుతుంది. ఇక దీని ధర రూ.46,640 నుంచి రూ.59,640 వరకు ఉంటుంది. అయితే ఇందులో రెండు రకాల వేరియంట్ల తో హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ స్కూటర్ రానుంది.
బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 : ఈ మోడల్ కూడా 2 వేరియంట్ లలో మనకు లభిస్తుంది. అందులో మొదటి వేరియంట్ ధర రూ.45,099 కా రెండవ వేరియంట్ ధర రూ.68,999 .. ఇక బ్యాటరీ ప్యాక్ తో కూడినది 1500 Q బిఎల్డిసి మోటార్ను కలిగి ఉంటుంది. ఇది ఒక్కసారి చాట్ చేస్తే 85 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అతి తక్కువ ధరకే లభించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు యువతను బాగా ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.