Vastu Shastra : హిందూ సంప్రాదాయాలు ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో వాస్తు ప్రకారం ఉంచితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. కొన్ని వస్తువులను ప్రధాన గుమ్మం ముందు ఉంచడం వల్ల చాలా శుభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు , వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ వస్తువులను ప్రధాన ద్వారం వద్ద కట్టడంవల్ల వల్ల ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయట. మన హిందూ శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మానికి తోరణం కట్టడం శుభప్రదంగా భావిస్తారు. ప్రతి శుభాకార్యం కు, పండుగలకు ఇంటి ప్రధాన ద్వారంపై మామిడి, రావి, అశోక ఆకులతో పాటు వేప రెమ్మలతో అలంకరిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ నిండి సర్వ సంపదలు కలుగుతాయని భావిస్తారు.
అలాగే పూల మాలను కూడా కడతారు. అయితే ఈ తోరణాలు ఎండిపోయినపుడు మీరు వాటిని తీసేసి.. మళ్ళీ కొత్తగా తోరణాలను కట్టుకోవచ్చు..గుమ్మానికి రెండు వైపులా శుభ ప్రదమైన స్వస్తిక్ గుర్తుని వేయడం మంచిదని భావిస్తారు. ఇది చెడు నుండి మనల్ని కాపాడుతుందని ఒక నమ్మకం. దీపావళి పూజ సమయంలో ఇంట్లో లక్ష్మీ దేవి పాదాలను ఉంచడం శుభశకుణంగా భావిస్తుంటారు. వాస్తు శాస్త్రు ప్రకారం మీరు ఇంటి ప్రధాన ద్వారం మీద లక్ష్మీ పాదాల గుర్తులను వేస్కోవచ్చు. ఇది ఇంట్లో సంపద, సంతోషాన్ని సూచిస్తుంది. మన హిందూ మతంలో ఏ పని మొదలుపెట్టినా సరే అది శుభ ప్రదమైన స్వస్తిక్ గుర్తుతో మొదలు పెడతారు. అంతేకాదు..ఇంటి గడపకు ఎదురుగా పైన ఉండే ఏదైనా ఎత్తు పైన వినాయకుడిని శిల్పం లేదా ఫొటో కానీ ఉంచుకుంటూ వుంటారు.
వినాయకుడి ప్రతిరూపం ఉంచుకోవడం వల్ల సర్వ విగ్నలు తొలుగుతాయని భావిస్తారు.అలాగే వారంలో మనం ఇంటి ముందు కల్లాపి చల్లిన ప్రతీ సారి గడపను కూడా శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమలతో కచ్చితంగా ముగ్గు పెట్టాలి. అలా చేస్తే లక్ష్మీ దేవి మన ఇంటికి వచ్చేందుకు ఇష్టపడుతుంది.మరియు ఇంటి బయట వున్న చీడపీడలు ఇంట్లోకి రాకుండా చేస్తుంది.ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. వీలైతే ప్రతిరోజూ దీపారాధన చేయండి. అలా వీలు కాని వారు వారంలో రెండు, మూడు రోజులైన సరే దేవుడి ముందు దీపం పెట్టాలి.ఇలా పెడితే లక్ష్మి దేవీ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి అష్టైశ్వర్యాలు పెరగాలంటే తప్పకుండా ఇలాంటి పనులు మేలు చేయాల్సిందే. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు దూరం అవుతాయి.