Health Benefits : ఏ సమయంలో అయినా సరే పచ్చికొబ్బరి తింటే శరీరం నొప్పులు చుట్టుకుంటాయని ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు . మరి ఖాళీ కడుపుతో తింటే ఇంకేమైనా ఉందా..? విరోచనాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు కానీ పచ్చి కొబ్బరి తినడం వల్ల నిజంగానే మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే పచ్చి కొబ్బరి తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఫిట్ గా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇక కొబ్బరి నూనె వంటల్లో ఉపయోగించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అని వైద్యులు కూడా తెలుపుతున్నారు. ఇందుకు ఉదాహరణ కేరళ ప్రజలు అని మనం చెప్పవచ్చు. అక్కడ కొబ్బరి.. కొబ్బరి నూనె లేని వంటకం తయారు చేయరు.
పచ్చి కొబ్బరి.. నూనె కూడా శరీరానికి మేలు చేస్తాయి ముఖ్యంగా కొబ్బరి నీళ్లు శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. ఇక కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు విషయానికి వస్తే కాల్షియం, సోడియం, పొటాషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషకాలు లభిస్తాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుంది. పచ్చి కొబ్బరి ప్రయోజనాలు కలగాలంటే ప్రతి రోజు పరగడుపున తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇకపోతే కొబ్బరిని ప్రతిరోజూ పరగడుపున తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరిలో బాదం , వాల్నట్, బెల్లం మిక్స్ చేసి ప్రతిరోజు తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అంతే కాదు ఖాళీ కడుపుతో పచ్చి కొబ్బరి తినే వారి శరీరంలో చెడు కొలెస్ట్రాల పేరుకుపోవడం అలాంటి సమస్యలు దూరం అవుతాయి. పైగా ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది . బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. ప్రతిరోజు పరగడుపున కొబ్బరి తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు.. పైగా బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.. అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఇకపోతే పచ్చికొబ్బరి ను అలాగే తినడం ఇష్టం లేకపోతే ఏదైనా వంటలలో వేసుకొని కూడా తినవచ్చు . ప్రయోజనాలను పచ్చికొబ్బరిని తినడం వల్ల శరీరం అనారోగ్యం పాలు కాకుండా ఉంటుంది. అందుకే పచ్చి కొబ్బరి వల్ల సమస్యలు వస్తాయనే అపోహలను దూరం చేసుకోవడమే మంచిది.