Big Boss 6 Telugu : గీతూ అభిమానుల‌కి కిక్కిచ్చే న్యూస్.. కాక‌పోతే అదొక్క‌టే బాధ‌

Big Boss 6 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న గీతూ ఊహించ‌ని విధంగా గ‌త వారం ఎలిమినేట్ అయిన విష‌యం తెలిసిందే. ఆమె ఎలిమినేష‌న్ అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. మొదట్లో గేమ్ బాగానే ఆడిన కూడా గత రెండు వారాల నుంచి ఆమె హద్దులు దాటి చివరికి మూల్యం చెల్లించుకోవ‌ల్సి వ‌చ్చింది. బాబోయే గలాట గీతు గేమ్‌ని మేము చూడలేకపోతున్నాం అని నెటిజన్లు గగ్గోలు పెట్టారు. ఇక చేసేదేం లేక ఆమెను ఎలిమినేట్ చేయ‌క త‌ప్ప‌లేదు. ఎలిమినేష‌న్ త‌ర్వాత తెగ ఏడ్చేసింది. తీవ్ర స్థాయిలో ఆవేదన చెంద‌డంతో పాటు నేను బిగ్ బాస్ వ‌దిలి వెళ్ళను సార్ అని మొండికేసింది.

good-news-for-geethu-fans
good-news-for-geethu-fans

Big Boss 6 Telugu : ఇది జ‌రిగే పనేనా?

నాగార్జున ఎంత ఓదార్చినా కూడా ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. అప్పటి వరకు తిట్టుకున్న కంటెస్టెంట్స్, ఆడియన్స్ గీతూ ఎలిమినేట్ కాకుండా ఉంటే బాగుండేదేమో, ఆమెను వెనక్కి పంపిస్తే బాగుండు అని అనుకున్నారు. కాని ఆమె చేసిన కొన్ని త‌ప్పులు వ‌ల‌న ఎలిమినేట్ కాక త‌ప్ప‌లేదు. అయితే టైటిల్ ఫేవరేట్ గా ఉన్న గీతూ ఎలిమినేట్ కావ‌డంతో గేమ్ లో కొంత పోటీ త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ నిర్వాహకులు సెకండ్ ఆప్షన్ గా ఆమెను వైల్డ్ కార్డు ఎంట్రీతో లోపలికి పంపే ఆలోచనలో ఉన్నార‌ని కొన్ని వార్త‌లు వినిపిస్తున్నాయి.రెండు మూడు వారాలు హౌస్ మేట్స్ ఆటతీరు, రేటింగ్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారనే టాక్ వినిప‌స్తుంది.

కొన్ని కండీష‌న్స్‌తో గీతూ ని బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఒకసారి బయకు వచ్చి తిరిగి హౌస్లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ కి ట్రోఫీ అందుకునే అవ‌కాశం ఉండ‌దు. టాప్ 5 కంటెస్టెంట్ గా ఫైనల్ వరకూ వెళ్లే ఛాన్స్ ఉంటుంది, కాని విన్న‌ర్ కాలేరు.గతంలో అలీ రెజా ఎలిమినేట్ అయి మరల వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్లోకి వెళ్ల‌గా , విన్న‌ర్ కాలేక‌పోయాడు. ఇప్పుడు గీతూ ప‌రిస్థితి కూడా అలానే అవుతుంద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు.