Lunar Eclipse : చంద్రగ్రహణం రోజున చేయాల్సిన దానాలు.. చేయకూడని పనులు ఇవే..

Lunar Eclipse : ఈరోజే చంద్రగ్రహణం.. ఈ సంవత్సరంలో రెండవ చివరి చంద్రగ్రహణం నవంబర్ 8 న వస్తుంది. ఈ చంద్రగ్రహణం సుమారు మూడు గంటల 45 నిమిషాలు ఉంటుంది. చంద్రగ్రహణం సమయంలో దైవారాధన చేస్తే మంచిది అని చెబుతుంటారు. ఈ గ్రహణం 2:38 నిమిషాలకు మొదలై సాయంత్రం 6:18 నిమిషాలకు ముగుస్తుంది.. సర్పకాలం మధ్యాహ్నం 2:38 నిమిషాలు, మధ్యకాలం సాయంత్రం గంటలు 4:28 నిమిషాలు, మోక్షకాలం సాయంత్రం గంటలు 6:18 నిమిషాలు. గ్రహణ పుణ్యకాలం గంటలు 3:40 నిమిషాలు.. ఈ గ్రహణం సమయంలో ఏం చేయాలో.. ఎలాంటి దానాలు చేయాలో.. ఏం చేయకూడదో.. ఇప్పుడు తెలుసుకుందాం..

dos-and-dont-dos-of-lunar-eclipse-day
dos-and-dont-dos-of-lunar-eclipse-day

చంద్రగ్రహణం రోజున తెలుపు రంగులో ఉన్న వస్తువులను దానం చేస్తే మంచిది. గ్రహణం రోజున తెల్లటి ముత్యాలు లేదా తెల్లటి ముత్యాలతో చేసిన ఆభరణాలను దానం చేస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది. పంచదార లేదా తెల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని తెస్తుంది. గ్రహణం రోజున పాలు, అన్నం లేదా వాటితో తయారుచేసిన వంటకాలలో దానం చేయాలి. ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక వెండి నాణాన్ని వేసి అందులో మీ ముఖాన్ని చూసుకోవాలి. గిన్నెలో ఉన్న వెండి నానంతో సహా బ్రాహ్మణులకు దానం చేస్తే ఆరోగ్య సమస్యలు నయమవుతాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రగ్రహణం సమయంలో ఆహారం వండడం, తినడం చేయకూడదు. గ్రహణ సమయంలో నిద్ర పోకూడదు. భగవంతుడి నామాన్ని జపించాలి. గ్రహణ సమయంలో గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మొక్కలను, చెట్లను తాకకూడదు.. గ్రహణానికి ముందు వండిన వంటను అస్సలు తినకూడదు. గ్రహణం కిరణాలు ఇంట్లోకి రాకుండా ఉండటానికి కిటికీలను మూసివేయాలి. గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలి. అలాగే గ్రహణం సమయంలో నూనె రాసుకోకూడదు.