Reliance Jio : జియో నుంచి సరికొత్త ప్లాన్స్.. బెనిఫిట్స్ మాత్రం అధుర్స్..!!

Reliance Jio : రిలయన్స్ జియో గురించి ఏ కస్టమర్ ని అడిగినా సరే ఠక్కున చంపేస్తాడు. మంచి ఫీచర్లతో అద్భుతమైన ప్లాన్స్ తో కష్టమర్లకు ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది అని. అందుకే దేశంలో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది రిలయన్స్ జియో. ఇకపోతే ప్రతిరోజు వర్క్ ఫ్రమ్ హోం పేరిట పనులు చేసుకునే వారు అలాగే మరికొంతమంది ఎక్కువగా వీడియోలు చూసేవారికి ప్రతిరోజు కూడా 2GB డేటా అవసరం అవుతుంది. ఇక ఈ ప్లాన్స్ ద్వారా మీరు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందవచ్చు. రిలయన్స్ జియో ప్లాన్స్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.249 జియో ప్లాన్ : రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ప్లాన్ మీరు 23 రోజుల వ్యాలిడిటీతో ఉపయోగించవచ్చు. ఇక ప్రతిరోజు 2gb డేటా లభిస్తుంది. అంటే 23 రోజులకు గాను 46 జిబి డేటాను పొందే అవకాశం ఉంటుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు 100 ఎస్ఎంఎస్లను ప్రతిరోజు ఉచితంగా పొందడమే కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ , జియో సెక్యూరిటీ లాంటి జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు.

రూ.299 జియో ప్లాన్ : జియో రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ప్లాన్ మీరు రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు ప్రతిరోజు 2gb డేటా చొప్పున 56 జీబీ పొందవచ్చు. ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందడమే కాకుండా జియో టీవీ , జియో సెక్యూరిటీ, జియో సినిమా, జియో క్లౌడ్ లాంటి జియో యాప్ లను సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు.

Get New offers from jio these are the benefits
Get New offers from jio these are the benefits

రూ.533 జియో ప్లాన్ : రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ప్లాన్ మీరు 56 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు. ఇక ప్రతిరోజు 2gb డేటా మొత్తంగా 112 జిబి డేటా వాడుకోవచ్చు. ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందడంతోపాటు జియో యాప్ల సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.

రూ.799 జియో ప్లాన్ : 56 రోజుల వ్యాలిడిటీ లభించే ఈ ప్లాన్ తో మీరు ప్రతిరోజు 2gb డేటాను పొందవచ్చు . ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది ప్రతిరోజు . ఇక అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ను ఏడాది పాటు ఉచితంగా వీక్షించవచ్చు. అంతేకాకుండా జియో ఆప్ లను కూడా పొందే అవకాశం ఉంటుంది.