Astrology : ఏ పని తలపెట్టినా జరగడం లేదా.. అయితే ఈ పనులు చేయండి..!

Astrology : కొంతమంది ఎంత కష్టపడి పని చేసినా ఫలితం శూన్యం అవుతుంటుంది. ఆర్థిక, సామాజిక ,భావోద్వేగ సమస్యలు వంటివి జీవితంలో జరిగినప్పుడు వాటిని పరిష్కరించడానికి అనేక సులభమైన ,సమర్థవంతమైన ఎన్నో చిట్కాలను పండితులు జ్యోతిష్య శాస్త్రంలో వివరించారు. ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే ఆ శనిదేవుని అనుగ్రహం మీ సొంతమవుతుంది. వాటిని ఎలా ఆచరించాలో ఇప్పుడు చూద్దాము. మీకు సరైనా సమయంలో డబ్బు అందక.. వచ్చే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేసి చూడండి. ఒక కొబ్బరికాయ తీసుకొని దానిపై పచ్చకర్పూరం పెట్టి వెలిగించి.. 21 సార్లు దిష్టి తీసుకోవాలి.ఆ తర్వాత ఆ కొబ్బరి కాయను ప్రవహించే నదిలో కానీ వాగు ల్లో కాని వదిలేయాలి. ప్రతి కుటుంబసభ్యులకు ఒక్కొక్క కొబ్బరికాయలను ఉపయోగించాలి.

Advertisement

సంవత్సరానికి రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.అయితే.. ఈ పరిహారం మంగళ వారం, గురువారం మరియు శనివారాల్లో మాత్రమే నిర్వహించుకోవాలి. ఇలాంటి సమస్య లకు ముఖ్య కారణం అయినా శని దేవుణ్ణి నిత్యం ఆరాధిస్తూ ఉండాలి. ఇంట్లో పాడైపోయిన గోడ గడియారాలు కానీ పగిలిన ఫోటో ప్రేమ్ లను కానీ ఉంచుకోకూడదు. ఇలా వుంటే శని ఆవాసం చేసుకుంటాడని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తుంటారు.ఇంట్లో ఉత్తరానా ఫిష్ అక్వేరియం ఉంచుకుంటే ఇళ్లు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది .గోమాత కు రోజు గడ్డి తినిపిస్తే చాలా మంచిది.శనీశ్వరుని చల్లని చూపు మన మీద కలగాలంటే ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తోంది.శని దోషం వున్నవారు కనీసం 11 మంది గుడ్డి వారికి అన్నదానం చేస్తే శని దోషం తొలగిపోతుంది. అంతే కాకుండా వికలాంగుడైనా, సన్యాసికైనా, పేదవాడికైనా అన్నం పెట్టడం వల్ల ఆర్థిక ఫలాలు లభిస్తాయి.

Advertisement
Are you suffering from financial status do this remedies
Are you suffering from financial status do this remedies

అలాగే, మన పురాణాల్లో వస్త్ర దానానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది.మన పూర్వికులు దానం చేయడం ఒక పుణ్య కార్యంగా భావిస్తారు. నలుపు లేదా వివిధ రంగుల దుప్పట్లను ఆర్థిక బాధల్లో ఉన్న వ్యక్తి తలపై ఉంచి 21 సార్లు మడవాలి . ఆ తర్వాత దాన్ని అవసరమైన వారికి దానం ఇస్తే శుక్రుని అనుగ్రహం కలిగి అవసరరానికి డబ్బు చేతికి అందుతుంది.ఈ పనిని శనివారం చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. పూర్వం పక్షుల కిలకీలరావాలతోనే రోజు మొదలయ్యేది. ఇప్పుడు కొన్ని పక్షులు తిండి లేక వాతావరణ కారణాలవల్ల అంతరించి పోయే దశలో వున్నాయి. మన పూర్వికులు పక్షులకు ఆహారం ఇవ్వడం ఎంతో అదృష్టంగా భావించేవారు. ఇప్పుడు కూడా ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలకు గుడ్ బై చెప్పొచ్చు.ఇంటి బాల్కనీలో పక్షులకు ఆహారం మరియు నీరు ఉంచండి. దీంతో.. ఏ పక్షి కూడా ఆకలితో ఉండదు కాబట్టి వాటి అనుగ్రహం కూడా మీ మీద పడి అన్ని సమస్యలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి

Advertisement