Health Benefits : పొట్ట శుభ్రంగా ఉండాలంటే ఏ పండ్లు తినాలో తెలుసా..?

Health Benefits : ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల కారణంగా పొట్ట సమస్యలు అధికమైపోతున్నాయి. మలబద్ధకం,అజీర్తి,గ్యాస్త్రిక్ సమస్యలు, అపెండిక్స్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలో జంక్ ఫుడ్ అలవాట్ల కారణంగా కడుపు లో ఏలికపాములు సమస్యలు అధికమై ఆపరేషన్ ల వరకు వెళ్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి సమస్యలకు కొన్ని పండ్లు తినడం వల్ల చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరెంజ్‌ ను తినండి.. నారింజ పండ్లను తినడం వల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది. ఒక నివేదిక ప్రకారం కడుపుని శుభ్రపరచడంలో నారింజ ఒక అద్భుతమైన పండు.పుల్లటి సిట్రస్ పండ్ల చెట్లలో ఆకులు, పువ్వులు ,బెరడు వంటి మూడు ప్రయోజనకరమైన భాగాలు ఉంటాయి. నారింజలో పీచు పదార్థాము అధికంగా ఉండడం వల్ల మలబద్ధకానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నారింజ పండ్లను తినడం వల్లఇందులో ఉండే విటమిన్ సి శరీరంపై వచ్చే చర్మ సమస్య కలగించే క్రీములకు యాంటీ ఏజెంట్స్ పనిచేస్తాయి. కమలపండ్లలో రక్తాన్ని శుభ్రపరిచే గుణం అధికంగా ఉంటుంది.

స్ట్రాబెర్రీలు.. నారింజ వంటి స్ట్రాబెర్రీలు కూడా కడుపు ,జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.. అలర్జీ లను కలిగించే వైరస్ లను నుండి శరీరాన్ని రక్షిస్తుంది. శరీరంలోని జీర్ణవ్యవస్థను శుద్ధి చేయడానికి స్ట్రాబెర్రీలను తినాలి. దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇమ్మ్యూనిటీ పవర్ ని కూడా పెంచుతుంది.

Health Benefits of Do you know which fruits to eat
Health Benefits of Do you know which fruits to eat

బొప్పాయి .. కడుపుని శుభ్రం చేయడం లో చాలా ఉపయోగపడుతుంది. అజిర్తి సమస్యలను తొలగించడానికి ఇది గొప్ప పండు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కడుపుని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఈ పండులో అధికంగా ఏ విటమిన్ ఉండడం వల్ల కంటి సమస్యలను దూరం చేస్తుంది.బొప్పాయి ని ముక్కలుగా కానీ,జ్యూస్ రూపంలో కానీ త్రాగితే మలబద్దకం నుండి ఉపాశమనం
కలుగుతుంది.

అవకాడో.. తిన్న ఆహారాన్ని తగినట్టుగా జీర్ణం చేయడంలో అవకాడో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని పెంచడానికి రోజూ వారి ఆహారంలో అవకాడో తినండి. ఈ పండులో కరగని పీచుపదార్తం ఉండడం వల్ల ఇది సరైన పేగు కదలికలను కొనసాగిస్తూ పేగులను శుభ్రపరుస్తుంది. అవోకాడో తినడం వల్ల పేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

జామ.. జామకాయ పేదవాడి ఆపిల్ పండు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆపిల్ లో ఉండవలసిన సుగుణలాన్ని జామపండులో వుంటాయి కాబట్టి. అందులోను దీని ధర అందరికి అందుబాటులో ఉంటుంది.పొట్ట సమస్యలకు మంచి విరుగుడు . ఇందులో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది. జామగింజల్లో భేదిమందు పదార్థాలు ఉంటాయి. ఇవి పొట్టను శుభ్రంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.ఈ పండ్లన్నీ రోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ఏ పొట్ట సమస్యలకయినా చెక్ పెట్టొచ్చు.