Hair Tips : రోజు నూనె రాసుకుంటారా .. చాలా జాగ్రత్త , ఇలా రాస్తున్నరేమో జుట్టు మొత్తం ఊడిపోవచ్చు ! 

Hair Tips: తలకు కొబ్బరి నూనె రాసుకుంటే.. జుట్టు ఊడిపోకుండా, త్వరగా తెల్లబడకుండా ఉంటుందని చాలా మంది తలకు నూనె రాసుకుంటుంటాం. దీని ద్వారా జట్టు కుదుళ్లు బలంగా మారతాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో నూనె రాస్తే జుట్టు ఊడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అలా ఎప్పుడెప్పుడు తలకు నూనె రాయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

Don't apply hair oil on these times it may hair fall
Don’t apply hair oil on these times it may hair fall

మీ స్కాల్ఫ్ జిడ్డుగా ఉంటే తలకి నూనె రాయకూడదు. తల జిడ్డు గా ఉన్నప్పుడు నూనె రాసుకుంటే జుట్టు కింద చర్మంపై మురికి ఎక్కువగా పేరుకుపోతుంది. ఫలితంగా జుట్టు ఊడిపోతుంది.తలపై చుండ్రు ఉన్నప్పుడు కూడా నూనె రాసుకోకూడదు. చుండ్రు ఎక్కువుగా ఉన్నప్పుడు నూనె రాసుకోవడం వల్ల జుట్టులో చుండ్రు సమస్య మరింత ఎక్కువ అవుతుంది. తలపై బొబ్బలు, పొక్కులు ఉన్నప్పుడు జుట్టుకు నూనె రాయడం వల్ల పొక్కులు మరింతగా వ్యాపిస్తాయి. త్వరగా తగ్గడం కూడా కష్టమవుతుంది. తల స్నానానికి కనీసం గంట ముందు జుట్టుకు నూనె రాసుకుని మసాజ్ చేసుకుంటే మంచిది. రాత్రిపూట తలకి నూనె రాసుకుని ఉదయం తలస్నానం చేసిన కూడా మంచిదే. అయితే తన స్నానం చేయడానికి కొన్ని నిమిషాల ముందు మాత్రం నూనె రాసుకుని తల స్నానం చేయకూడదు. తల తడిగా ఉన్న సమయంలోనూ నూనె రాయకూడదు. ఆరిన తర్వాత రాసుకోవాలి. ఇప్పుడు చెప్పిన విధంగా తలకు నూనె రాసుకోకుండా ఉంటే మీ జుట్టుకి ఎలాంటి సమస్యలు రావు.