Mislead :పండగ రోజు పోలీసులకి ఫ్యూజ్ ఎగిరే కేసు – చెట్టు మీద నుంచి పడి చచ్చిపోయిన పెళ్ళాం .. కట్ చేస్తే !!

Mislead : కాకినాడ జిల్లా పిఠాపురం మండ‌లం కొత్త‌మాద‌వ‌పురం గ్రామంలో నివాస‌ముంటున్న ఆళ్ల హేమమాలిని కొద్ది రోజుల క్రితం పెర‌టీలోని ఉన్న జామ‌చెట్టుపై కాయ‌లు కోసేందుకు ఎక్కి జారి ప‌డింది. దాంతో ఆమె వెన్నెముఖ‌కు దెబ్బ‌త‌గ‌ల‌డంతో చికిత్స పొందుతూ మరణించింది. దీనిపై కేసు న‌మోదుచేసిన పోలీసుల‌కు విస్తుపోయే నిజాలు తెలిసాయి.. హేమ‌మాలిని భ‌ర్త నారాయుడు మ‌ద్యానికి బానిసై నిత్యం హేమ‌మాలినిని విసిగించేవాడు.

Narayudu mislead police on her wife hemamalini no more
Narayudu mislead police on her wife hemamalini no more

నారాయుడు స‌రిగ్గా కుటుంబాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో.. వాళ్ళిద్దరూ త‌ర‌చూ గొడ‌వ‌లు పడుతుండేవారు. కాగా కొద్ది రోజుల కింద‌ట ఇద్ద‌రికి మళ్ళీ ఓ గొడవ జ‌రిగింది. అప్పుడే నారాయుడు హేమ‌మాలిని మంచం కోడెతో కొట్ట‌డంతో ఆమె వెన్నెముఖ‌కు బ‌ల‌మైన గాయ‌మై.. అప‌స్మార‌కస్థితిలోకి వెళ్ళిపోయింది. వెంటనే తనని హాస్పిటల్ లో జాయిన్ చేసి వాళ్ళని తన భార్య చెట్టుపై నుండి ప‌డిపోయింద‌ని న‌మ్మించాడు. కానీ పోలీసులు ఆ విషయాన్ని తేలికగా తీసుకోలేదు.. త‌మ‌దైన శైలిలో విచార‌ణ చేయ‌డంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

నారయుడు త‌న భార్య తాను కొట్ట‌డం వ‌ల్లే చ‌నిపోయింద‌ని పోలీసుల విచార‌ణలో అతను చెప్ప‌డంతో.. అత‌డ్ని అరెస్టు చేసి, కోర్టుకు హాజ‌రుప‌రిచారు. మొద‌ట అనుమాన‌స్ప‌ద కేసు న‌మోదు చేసిన పోలీసులు, దానిని హ‌త్య కేసుగా మార్పు చేశారు. నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టుకు హాజ‌రుప‌ర‌చ‌గా న్యాయ‌మూర్తి నిందితుడు నారాయుడుకి రిమాండ్ విధించారు. త‌క్కువ కాలంలో కేసు చేధించిన పిఠాపురం స‌ర్కిల్ ఇన్స్ పెక్ట‌ర్ వై.ఆర్‌.కే.శ్రీనివాస్‌, ఎస్ఐ. జ‌గ‌న్మోహ‌న్‌రావుల‌తో పాటు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ర‌వీంధ్ర‌నాథ్‌బాబు అభినందించారు.