Ishwarya Rai: అందమైన ఒత్తైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది.. కానీ శీతాకాలం కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది.. ఐశ్వర్యారాయ్ లాంటి అందమైన జుట్టు మీకు కావాలంటే ఉసిరి పొడితో ఈ చిన్న చిట్కా ఫాలో అయితే చాలు.. ఉసిరి లో ఉండి ఎన్నో పోషకాలు జుట్టుకి పోషణ అందిస్తాయి. ఉసిరి నీరు మీ జుట్టుకి బలాన్ని మెరుపును ఇస్తుంది. వారానికి రెండుసార్లు జుట్టుకు ఆమ్లా నీటిని అప్లై చేస్తే చాలా మంచిది.. ఆ ఆమ్లా నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ముందుగా ఒక ఇనప గ్లాసు లేదా బాండిని తీసుకోవాలి. అందులో మూడు కప్పుల నీటిని పోయాలి. ఆ నీటిలో ఒక చెంచా ఉసిరి పొడిని వేసి బాగా కలపాలి ఈ నీటిని రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం ఆ నీటిని మరొక పాత్రలోకి వడపోసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఆమ్లా నీటిని మన జుట్టు కుదుళ్ల నుంచి చివర వరకు పట్టించాలి. ఈ నీటిని రాసుకొని ఒక గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో జుట్టు కడుక్కోవాలి ఇలా చేస్తే ఐశ్వర్యారాయ్ లాంటి ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది. అయితే మంచి ఫలితాలు పొందటానికి వారానికి రెండు లేదా మూడుసార్లు ఆమ్లా నీటిని జుట్టుకు పట్టిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.