Samantha: ముంబై ఎయిర్పోర్టు లో సమంత వీడియో చూసి అక్కినేని అమల ఊహించని కామెంట్స్ ! 

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా ఇంట్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత తాజాగా ముంబై ఎయిర్పోర్టులో కనిపించింది.. సమంత మయోటైటిస్ వ్యాధి సోకిన తర్వాత తొలిసారి పబ్లిక్ ప్లేసులో కనిపించింది.. దాంతో ఒక్కసారిగా ఆమెను కెమెరాలు వెంటాడాయి. సమంత ముంబై ఎయిర్పోర్టులో కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. అయితే సమంత వీడియో చూసిన అక్కినేని అమల ఊహించని కామెంట్స్ చేశారట.!

Amala comments on Samantha Mumbai airport video seen
Amala comments on Samantha Mumbai airport video seen

అమల తన సన్నిహితులతో మాట్లాడుతూ.. సమంత ఆరోగ్యం కుదుటి పడినట్లు ఉంది సమంత ఇకమీదట నుంచి ఇంతే ఆరోగ్యంగా ముందుకు దూసుకెళ్లాలని ఆ దేవుడు తనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆమె సన్నిహితులతో అన్నారట. సమంత తన ఆరోగ్యం కాస్త కుదుట పడడంతో బ్యాక్ టు వర్క్ లోకి దిగిందని టాక్. బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని వైట్ అండ్ వైట్ లో బాస్ లేడీ త్వరలో స్టైల్ తో అదరగొట్టింది. కాగా తాజా లుక్ లో మాత్రం సమంత ముఖంలో మునుపటి తేజస్సు కనిపించడం లేదని నెటిజన్లు అంటున్నారు. మేకప్ లేకుండా సమంత కనిపించడం ఇక్కడ మరో విశేషం.