Shesh Supriya: నిజంగా అడివి శేష్ బంగారం రా .. సుప్రియా జీవితం లో ఇది జరిగింది అని తెలిసి కూడా ఆమెతో పెళ్ళికి ఓకే అన్నాడు !

Shesh Supriya: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది యార్లగడ్డ సుప్రియ. ఆ తర్వాత సినిమాలలో నటించలేదు.. చేయలేదు. ఇష్టం సినిమాలో హీరోగా నటించిన చరణ్ రెడ్డితో సుప్రియ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. చరణ్ విపరీతమైన మద్యానికి బానిస కావటంతో సుప్రియ అతడికి దూరమైంది. ఆ తర్వాత చరణ్ అనారోగ్యంతో మృతి చెందాడు. సుప్రియ జీవితం కూడా పెద్ద విషాదంగా మారిపోయింది. దాంతో ఆమె చాలా రోజులు బయటకు కనిపించలేదు. చాలా రోజుల తర్వాత అడ‌వి శేష్ హీరోగా వచ్చిన గూఢ‌చారి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించింది. అప్పటి నుంచే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని.. సుప్రియ కంటే వయసులో చిన్నోడైన అడవి శేషుతో ఆమె ప్రేమలో ఉందని… వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి.

Adavi Sesh bring light to Supriya life
Adavi Sesh bring light to Supriya life

సుప్రియ తోనే శేష్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టుగా ప్రచారాలు అయితే కొంతకాలంగా జరుగుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్లలో బయటకు వచ్చిన ఫోటోలో అక్కినేని కుటుంబ సభ్యుల మధ్యలో అడవి శేష్‌ కూడా ఉన్నాడు. దాంతో శేష్ సుప్రియ‌ నిజంగానే రిలేషన్ లో ఉన్నారా అంటూ వస్తున్న సందేహాలకు మరింత బలం చేకూరింది. ఈ ఫోటోలో శేష్ సుప్రియ పక్కనే చాలా చనువుగా ఉన్నట్టు కనిపించారు. ఇప్పటివరకు వీరి రిలేషన్ సీక్రెట్ గా కొనసాగుతుంద‌న్న డౌట్లు ఉన్నా… తాజా ఫోటోతో వీరిద్దరూ ఓపెన్ అయిపోయారన్న చర్చలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్నాయి. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా అనేది వారి వ్యక్తిగతం.. సుప్రియ జీవితంలో అన్ని విషాద ఛాయలు ఉన్నాయని తెలిసినా శేష్ సుప్రియ కి కొత్త జీవితం ఇచ్చి.. ఆమె స‌రికొత్త వెలుగులు నింపుతాడా అనేది చూడాలి.