Suneetha: సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు.. తన పాటలతో శ్రోతలను మైమరచిపోయేలా చేస్తుంది.. అయితే సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, పాటల కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరించిన సింగర్ సునీత ఇప్పుడు తనలోని మరో యాంగిల్‌ని బయటకు తీస్తుంది. నటిగా మారబోతుందని.. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమాలో సింగర్ సునీత మహేష్ కి అక్క పాత్రలో కనిపిస్తుందంటూ.. గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సింగర్ సునీత ఈ సినిమాలో నటించడంలేదని ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

సునీత కు యాక్టింగ్ లో అసలు అనుభవం లేకపోవడంతో ఆమె కాస్త ఆలోచనలో పడ్డారని.. కానీ త్రివిక్రమ్ భరోసా ఇవ్వడంతో నటించేందుకు ఒప్పుకుందని టాక్ గట్టిగానే వినిపించింది. మహేష్ కి అక్కగా బలమైన పాత్రలో సునీత నటించనని త్రివిక్రమ్ కి చెప్పేసిందట.. త్రివిక్రమ్ ఇంటికి వెళ్లి మరీ ఇచ్చిన బంపర్ ఆఫర్ ని మొహం మీదే NO NO NO చెప్పిన సింగర్ సునీత.. నాకు నటనపై ఆసక్తి లేదని కొత్తగా ఇప్పుడు ప్రయోగాలు చేయడం ఎందుకని ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని మహేష్ సినిమాలో నేను నటించకపోయినా ఈ సినిమాకు నేను కచ్చితంగా పాటలు పాడతానని సునీత సున్నితంగా ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందని సమాచారం మరి ఇందులో ఎంత నిజం ఉందో త్వరలోనే తెలుస్తుంది.