పౌరులకు సాధికారత కల్పించడం, ప్రజా భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా డైలీహంట్, వన్ఇండియాలతో తాజాగా ఢిల్లీ పోలీసులు చేతులు కలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఢిల్లీ పోలీసులు వచ్చే రెండేళ్లలో సైబర్ భద్రత, మహిళల భద్రత, మాదకద్రవ్యాల దుర్వినియోగం వంటి అంశాలపై కీలక సమాచారాన్ని పంచుకోవడంపై దృష్టి సాధించనున్నారు. భారతదేశంలోని ప్రముఖ కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లైన డైలీహంట్, వన్ఇండియా ఈ సామాజిక సమస్యలను ప్రచారం చేయడంలో ఢిల్లీ పోలీసులకు మద్దతు ఇవ్వడానికి తమ కోట్లాది మంది పాఠకులను ఉపయోగించుకుంటాయి.
పౌరులకు ముఖ్యమైన భద్రతకు సంబంధించిన సమాచారాన్ని అందించడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం. డైలీహంట్ తన ప్లాట్‌ఫామ్‌లో ఢిల్లీ పోలీసుల ప్రొఫైల్‌ను కూడా ప్రదర్శిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ పాఠకులను ఆకర్షించడానికి, ముఖ్యంగా యువతతో కనెక్ట్ అవ్వడానికి వీడియోలు, షేర్ కార్డ్‌లు, లిస్ట్‌లు, లైవ్ స్ట్రీమ్‌ల వంటి ఆకర్షణీయమైన ఫార్మాట్‌లను ఉపయోగిస్తుంది. అదే సమయంలో సమాచారం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలా వన్ఇండియా అనేక ప్రాంతీయ భాషలలో కథనాలు, ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోలను పబ్లిష్ చేస్తుంది.
Eterno Infotech ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రావణన్ N, ఢిల్లీ పోలీసులు తమ ప్లాట్‌ఫామ్‌లపై చేరినందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. పోలీసులకు, సమాజానికి మధ్య బంధాన్ని బలోపేతం చేసే తమ లక్ష్యాన్ని హైలెట్ చేశారు. ఇకపోతే Dailyhunt అనేది ఇండియాలోని ప్రముఖ స్థానిక భాషా కంటెంట్ కలెక్షన్ ప్లాట్‌ఫామ్. ఇది 15 భాషలలో అన్ని వార్తలను కలెక్ట్ చేసి రీడర్స్ కి అందజేస్తుంది. ఇక OneIndia అనేది 11 మాతృభాషలలో రోజూ లక్షల మంది వినియోగదారులకు న్యూస్ అందించే ఒక వార్తా సంస్థ.