ప్రిన్స్ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ చాలానే డబ్బులు వెనకేశాడు. ఈ హీరో ప్రైవేట్ విమానం, లగ్జరీ వ్యానిటీ వ్యాన్‌ను కొనుగోలు చేశాడు. టెక్స్‌టైల్ బ్రాండ్‌ను కూడా స్థాపించాడు. AMB సినిమాస్‌కు సహ యజమానిగా ఉన్నాడు. అతను శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవ్వరు వంటి అనేక హిట్‌లను అందించిన ప్రొడక్షన్ హౌస్‌ను కూడా నడుపుతున్నాడు. ఇంకా తన వ్యాపారాలను విస్తరించేందుకు మహేష్ యోచిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్‌ను కొనేశాడట. దీనికి సంబంధించిన వార్తలు సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సూళ్లూరుపేటలో “వి సెల్యులాడ్స్ వి ఎపిక్” అనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించగా.. దానిని మహేష్ తాజాగా కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ థియేటర్ చాలా పెద్ద స్క్రీన్, 650 కి పైగా సీటింగ్ సామర్థ్యంతో చాలా విశేషంగా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. ఇందులో సినిమా చూడాలంటే కనీసం 200 రూపాయలు చెల్లించాలని కూడా అంటున్నారు. ఇంకా ఈ థియేటర్‌లో ప్రేక్షకులకు అవసరమైన దాదాపు అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వరల్డ్ క్లాసు ఫెసిలిటీస్ ఇందులో ఆఫర్ చేసినట్లు ఈ విషయం తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
కాగా దీనిపై మహేష్ బాబు నుంచి ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే మహేష్ వ్యాపారంలో ఓ ఘనత సాధించినట్లు అవుతుంది. అలాగే ఈ హీరో ఖాతాలోని రెండవ థియేటర్ వచ్చి చేరుతుంది. ఇక మరోవైపు మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ హై-ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నాడు.