దస్తగిరిని కూడా అదే చేస్తారు … ఆధారాలతో సహా వివరించిన లాయర్?

వైఎస్ వివేకా హత్య కేసు విషయం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో వున్న ట్విస్టులు తెలుగు సినిమాల్లో కూడా మనకు కనిపించవు. ఎప్పటికప్పుడు ఈ కేసు విషయమై అనేక విషయాలు బయటకొస్తూ ఉంటాయి. దురదృష్టకరం ఏమిటంటే ఈ కేసులో అసలు నిందితులు ఇంటి దొంగలే అని ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ జనాలను ఏమార్చడానికి మన పాలకులు, న్యాయస్థానాలు చేసిన పోరాటం చూస్తే ఆహా అనిపించక మానదు. ఇక తాజాగా ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఇటీవల ఓ ఛార్జ్ షీట్ ను కోర్టులో సమర్పించింది. ఈ ఛార్జ్ షీట్ ను పలు సాంకేతిక కారణాలతో కోర్టు వెనక్కి పంపగా సీబీఐ వాటిని సరిచేసి మళ్లీ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఛార్జ్ షీట్ ను కోర్టు వెనక్కి పంపడంతో సీబీఐకి షాక్ తగిలినట్లైంది.

ఇదిలా ఉంటే ఈ కేసు విషయమై హైకోర్టు లాయర్ ఒకరు సంచలన విషయాలు బయటపెట్టారు. వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు దస్తగిరి విషయమై ఈ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. అప్రూవర్‌గా మారిన నిందితుడు దస్తగిరిని ఎన్ని విధాలుగా బాధ పెట్టాలో అన్ని విధాలుగా అతగాడిని అసలు నిందితులు టార్చర్ చేస్తున్నారని తెలిపింది. వారి విషయంలో దస్తగిరి ప్రతిక్షణం జాగ్రత్తగా వ్యవహరించాలని లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం లేకపోలేదని అన్నారు. ఈ విషయంలో ఆమె న్యాయస్థాలనే గట్టిగా వ్యవహరించమని, నిజానిజాలు ప్రజలకు తెలపాలని, ఎంతో ప్రేమగా ఎన్నుకున్న పాలకుల గుట్టు విప్పాలని సూచించింది.

ఇకపోతే ఈ కేసులో భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి పిటీషన్లపై విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. అదేవిధంగా ఈ కేసులో అరెస్ట్ కాబడి చంచల్ గూడ జైల్లో ఉన్న 6 మంది నిందితులకు సీబీఐ కోర్టు రిమాండ్ ను ఇటీవల పొడిగించిన సంగతి విదితమే. నిందితులు సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్, శివశంకర్ రెడ్డి రిమాండును జులై 14 వరకు సీబీఐ కోర్టు పొడిగించింది. ఇదే రోజున సీబీఐ అనుబంధ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఇప్పటివరకు రెండు ఛార్జ్ షీట్ లు దాఖలు చేయగా తాజాగా మూడో ఛార్జ్ షీట్ ను సీబీఐ దాఖలు చేయడం గమనార్హం. ఈ ఛార్జ్ షీట్ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై దాఖలు చేసింది.

మరోవైపు తనను ఎలాగైనా జైలుకు పంపాలని వైసీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని దస్తగిరి ఎప్పటికప్పుడు ఆరోపిస్తూ వస్తున్నాడు. తనను ఏదో ఒక కేసులో ఇరికించి ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నారని మీడియా ముందు వాపుతున్న పరిస్థితి. పులివెందులలో ఓ పిల్లాడిని తాము నిర్బంధించి హింసించామని తమపై తప్పుడు కేసు పెట్టారంటూ భార్య షబానాతో కలిసి నిన్న ఆయన జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరులు, వైసీపీ నేతలు తమను బెదిరిస్తున్నట్టు దస్తగిరి బాహాటంగానే చెబుతున్నప్పటికీ పోలీసు వ్యవస్థ ఏమి చేయలేని పరిస్థితి వుంది. అయితే తనపై పెట్టిన తప్పుడు కేసుల గురించి సీబీఐ ఎస్పీకి, జిల్లా న్యాయమూర్తికి ఎప్పటికప్పుడు లేఖల ద్వారా ఫిర్యాదు చేస్తున్నాడు దస్తగిరి. దస్తగిరి ఎంట్రీతో మలుపు తిరిగిన ఈ కేసు ఎప్పటికి ఓ కొలిక్కి వస్తుందో చూడాలి మరి!