Beauty Tips : చర్మ సౌందర్యానికి కొబ్బరి నీళ్ళే బెస్ట్.. ఎలాగంటే..?

Beauty Tips : చర్మ సౌందర్యాన్ని పెంపొందించు కోవాలి అంటే ఎన్నో రకాల ఉత్పత్తులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి ఎన్నో రకాల ఉత్పత్తులు ఉన్నప్పటికీ కొబ్బరినీళ్లు అనేవి చాలా ఉత్తమం. ముఖ్యంగా కొబ్బరి నీళ్లను తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాదు కాంతి వంతంగా ఉంటుంది. ఇకపోతే కొబ్బరి నీళ్ళు తాగడానికి మాత్రమే కాదు ముఖంపై అప్లై చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా కొబ్బరి నీళ్లను ముఖంపై అప్లై చేయడం వల్ల మొటిమల సమస్య కూడా తొలగిపోతుంది. ఇందుకోసం మీరు కొబ్బరి నీళ్లను ఒక గిన్నెలో తీసుకొని.. ఒక కాటన్ బాల్ ముంచి ముఖంపై మొటిమలు ఉన్నచోట కొద్దిసేపు అప్లై చేయాలి.. ఆ తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖం మీద వచ్చే మొటిమలు దూరమవుతాయి.

ఎండాకాలం వచ్చిందంటే చాలామంది పొడిబారిన చర్మం సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చర్మ సమస్యలలో పొడి చర్మం కూడా ఒకటి. పొడి చర్మ సమస్యలు ఉన్నవారికి ముఖం నిర్జీవంగా కనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొబ్బరి నీటిని ఉపయోగించడం వల్ల కొబ్బరి లో ఉండే యాంటి ఆక్సిడెంట్ లు.. నాచురల్ షుగర్ తో ఈ సమస్యను దూరం పెట్టవచ్చు. ముఖ్యంగా కొబ్బరి నీటిని ముఖానికి అప్లై చేసి కొద్ది సేపు అలాగే ఉంచి ఆ తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకుంటే పొడిబారిన చర్మం కూడా తిరిగి తాజాదనాన్ని అందుకుంటుంది.

Coconut water is the best for skin beauty
Coconut water is the best for skin beauty

కొబ్బరి నీళ్లను టోనర్ గా కూడా పనిచేస్తుంది. కొబ్బరి నీళ్లను స్ప్రే బాటిల్లో వేసుకొని అందులో కొన్ని రోజ్ వాటర్ కలపాలి. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఈ టోనర్ ని ముఖంపై మీరు స్ప్రే చేస్తూ ఉండడం వల్ల మంచి టోనర్ గా కూడా ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో వచ్చే ట్యాన్ ను తొలగించడానికి కొబ్బరి నీళ్ల తో ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయాలి. ఇందుకోసం ముల్తానీ మట్టి తీసుకోని..అందులో కొన్ని కొబ్బరి నీళ్ళు పోసి అవసరాన్ని బట్టి కలపాలి . ఇప్పుడు ఫేస్ కి అప్లై చేసి ఆ తర్వాత కాసేపు అలాగే ఉంచి ఇప్పుడు సాధారణ నీటితో శుభ్రం చేస్తే ఎలాంటి సమస్యలు అయినా సరే ఇట్టే దూరం అవుతాయి.