Weight loss : అమ్మాయిలూ స్లిమ్ గా కనిపించాలంటే..?

Weight loss : ఇటీవల కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో అధిక బరువు కూడా ఒకటి.. ముఖ్యంగా మహిళలు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నప్పుడు నలుగురిలో ధైర్యంగా తిరగలేక వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పోతోందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇకపోతే మాంసాహార పదార్థాలలో ప్రొటీన్ లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. శాఖాహారులు ప్రోటీన్ల ప్రయోజనాల్ని పొందాలి అంటే తమ ఆహారంలో ఒక భాగంగా పప్పులను చేర్చుకోవాలి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్ లు ఈ పప్పు దినుసులు కొంత మొత్తంలో కలిగి ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకొనే వారికి తప్పని ఎంపిక.

గుడ్డులోని తెల్ల సొన ఇంకా పచ్చసొన రెండింటిలో కూడా ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకొనే వారు పూర్తి గుడ్డు తినాలి . అప్పుడే మీకు కావలసిన అన్ని పోషకాలు లభిస్తాయి. మీకు అందుబాటులో ఉండే అన్ని రకాల చేపలలో కూడా ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి కొన్ని రకాల చేపలు తింటే బరువు పెరుగుతారు అనే అపోహ వదిలి చేపలను మీరు నిరభ్యంతరంగా తినవచ్చు. ఫలితంగా బరువు కూడా అదుపులో ఉంటుంది. తరచూ చేపలను అధికంగా తీసుకునే వారిలో ఊబకాయం సమస్యలు కూడా దూరం అవుతాయి.ఇక మాంసాహారులైతే చికెన్ మీ ఆహారంలో చేర్చుకోవచ్చు . చికెన్లో ప్రొటీన్లతో పాటు పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి.

Weight loss If girls want to look slim
Weight loss If girls want to look slim

ఇక కొన్ని రకాల నట్స్ అలాగే డ్రైఫ్రూట్స్ లో కూడా ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉంటుంది.కానీ ద్రాక్ష, అత్తి పండ్లలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. కాబట్టి తక్కువ పరిమితిలో తీసుకోవడం మంచిది. రోజుకు మీ శరీరానికి సరిపడా నీటిని తాగడం.. పోషక ఆహారం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటూ.. కొవ్వు శాతం అధికంగా ఉండే ఆహారాలను దూరం పెట్టాలి. కొన్నిరకాల ఎక్సర్సైజులు కూడా మీరు స్లిమ్గా, అందంగా కనిపించడానికి సహాయపడతాయి. ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించినట్లైతే చాలా స్లిమ్ గా అందంగా కనిపిస్తారు.