Calcium : కాల్షియం సమృద్ధిగా లభించాలంటే ఏం చేయాలి..?

Calcium : క్యాల్షియం ఎప్పుడైతే తక్కువవుతుందో అప్పుడు ఎముకల సమస్యలు అధికమవుతాయి. ఫలితంగా ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకే ఐరన్ సమృద్ధిగా లభించే కొన్ని రకాల ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవడం తప్పనిసరి. అందుకే ఇప్పుడు చెప్పబోయే కొన్ని గింజలు కాల్షియం నిధి అని చెప్పవచ్చు. అవి ఏంటో కాదు తెల్లనువ్వులు. నువ్వులు కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి నల్ల నువ్వులు.. రెండు తెల్ల నువ్వులు. ఇకపోతే నువ్వుల గురించి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ప్రతి రోజు కూడా వంటకాలలో మనం వాడుతూనే ఉంటాము.

అందుకే నువ్వుల రుచి గురించి తెలిసినప్పటికీ అవి చేసే మేలు గురించి చాలా మందికి తెలియదు అనే చెప్పాలి. నువ్వులలో మన శరీరానికి కావలసిన కాల్షియం అధికంగా ఉంటుంది. 100 గ్రాముల నువ్వుల్లో 1450 గ్రాముల కాల్షియం అధికంగా ఉంటుంది. పెద్దలకి 450 మిల్లీ గ్రాముల కాల్షియం , పిల్లలకి 600 మిల్లీ గ్రాములు, గర్భిణీ మహిళలకు 900 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. అందుకే ప్రతి రోజు నువ్వుల ఉండలు తినమని వైద్యుల సలహా ఇస్తూ ఉంటారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ఏమిటంటే బెల్లంతో నువ్వుల ఉండలు తయారు చేసుకొని తినడం అనేది ఆనవాయితీగా వస్తోంది.

What should be done to get rich in calcium
What should be done to get rich in calcium

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు క్యాల్షియం నువ్వుల ద్వారా లభిస్తుంది కాబట్టి వైద్యుల సలహా తీసుకొని నువ్వుల ఉండలు తింటే మంచిది. ఇకపోతే చాలామంది నువ్వులు అంటే ఇష్టం ఉన్నప్పటికీ వేడి చేస్తుందని అనుమానంతో వాటిని పక్కన పెడుతూ ఉంటారు. అయితే ఇది ఏ మాత్రం నిజం కాదు.. ఎందుకంటే నువ్వుల లో వేడి చేసే గుణం అసలు లేదు.. నీరు తాగకపోవడం.. నిల్వ పచ్చళ్ళు తినడం వల్ల వేడి పెరిగే అవకాశం ఉంటుంది. శరీరానికి అవసరమయ్యే నీరు సరిగా తాగకపోవడం వల్ల కూడా శరీరం వేడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్లు అధికంగా తాగాలి. మొలకెత్తిన గింజలు తినేటప్పుడు నువ్వులను కలిపి తీసుకుంటే మంచిగా శరీరానికి కాల్షియం లభించి మీరు ఐరన్ మ్యాన్ లా మారిపోతారు.