Health Benefits : రత్నం కంటే విలువైన ఈ చెట్టు కనిపిస్తే కొమ్మను ఇంటికి తెచ్చుకోండి..! ఎందుకంటే..!?

Aare Chettu : ప్రకృతి లో ఎన్నో మొక్కలు.. వాటిలో మనకు తెలిసింది కొన్ని మొక్కల గురించి మాత్రమే.. ఆరె చెట్టు లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.. ఈ మొక్క వలన ఇంటి వాస్తు దోషాలను, నరదిష్టిని పోగొడుతుంది..! ఆరెచెట్టు వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య, వాస్తు ప్రయోజనాలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు..!!ఆరెచెట్టు విత్తనాలను తీసుకుని వేడి నీటినీ పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి.

ఈ మిశ్రమాన్ని మోకాళ్ల కు వేసుకోవాలి ఇలా తరచూ చేస్తుంటే మోకాళ్ల నొప్పులు వారంలో తగ్గిపోతాయి. ఈ చెట్టు ఆకులు దంచి వాటిని ఆముదంలో వేయించి ఒక క్లాత్ లో వేసి పొట్ట పై కాపడం పెడితే.. కడుపు నొప్పి తగ్గుతుంది. ఈ చెట్టు ఆకులు ముద్దగా నూరి తలకు రాసుకుంటే తలనొప్పిని తగ్గుతుంది. ఈ ఆకుల కషాయం క్షయ వ్యాధిని తగ్గిస్తుంది.ఆరెచెట్టు కర్ర ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో డబ్బులకు కొదవుండదని.. ధన కనక వర్షం కురుస్తుంది అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

health benefits in Aare Chettu 
health benefits in Aare Chettu

ఇల్లు కట్టిన తర్వాత ఏమైనా వాస్తు దోషాలు ఉంటే ఆరె కర్ర ఇంట్లో దేవుడి మందిరంలో పెట్టి పూజిస్తే ఆ దోషాలు అన్ని తొలగిపోతాయి. అంతేకాకుండా ఆరె కర్ర పూజించే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. నరదిష్టి, నేత్ర దిష్టి పోగొడుతుంది. లక్ష్మి దేవికి ఈ చెట్టు అంటే చాలా ఇష్టం. ఈ చెట్టు వేరును మెడలో కట్టుకుంటే మనకు దిష్టి తగలకుండా చేస్తుంది. మెడలో ధరిస్తే గ్రహ దోషాలను తొలగిస్తుంది.