Devotional News : దుష్ట శక్తులను దూరం చేయాలంటే..?

Devotional News : ఎవరైనా సరే కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినా లేదా అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి అంటే చాలు..ఇంట్లోకి దుష్ట శక్తులు వచ్చాయేమో లేదా ఎవరైనా గిట్టని వారు తమపై చేతబడి చేయించారు ఏమో అని అనుమానం తో చాలామంది సతమతమవుతూ ఉంటారు. ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం కలిగినప్పుడు వెంటనే వేదపండితుల దగ్గరకు.. స్వామీజీల దగ్గరకు వెళ్లి జాతకాలను చూపించుకోవడం యంత్రాలు, తాయత్తులు కట్టించుకోవడం వంటివి చేస్తూ వేలకు వేలు డబ్బులు నాశనం చేస్తూ ఉంటారు.దుష్టశక్తులు రాకుండా ఉండాలి అన్న లేదా ఎవరైనా చేతబడి చేసిన మనపై పారకుండా ఉండాలి అన్నా మనం ఇంట్లో కొన్ని పనులు చేస్తే దుష్ట శక్తుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ఎటువంటి చెడు ప్రభావం ప్రవేశించకుండా కుటుంబాన్ని కూడా కాపాడవచ్చు. అందుకోసం ఏం చేయాలి అంటే ముందుగా ఇంటిని శుచిగా.. శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాదు నిత్యం దీపారాధన చేస్తూ భగవన్నామ స్మరణం జపించాలి. ఇక పురిటి స్త్రీని విడిగా ఉంచాలి అంతే కాదు స్త్రీలు రుతుసమయంలో కూడా భర్త దగ్గరకు వెళ్ళకూడదు.మరి ఇంటి ఆవరణంలో వేప, నిమ్మ ,తులసి చెట్లను కచ్చితంగా పెంచుకోవాలి. ఇంట్లో రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత వంటి పవిత్రమైన గ్రంథాలను కూడా ఉంచుకోవాలి. ఇక వీలైతే ప్రతిరోజూ వాటిని పారాయణం చేయడం లాంటివి చేయాలి.

Devotional News of evil spirits from home follow these tips
Devotional News of evil spirits from home follow these tips

ఇకపోతే గోమాతకు బెల్లం, బియ్యం పెట్టి పూజించడం వల్ల ఇంట్లోకి ప్రవేశించే చెడు దృష్టి కూడా అంతా పోతుంది అని చెబుతారు. అంతేకాదు శుక్రవారం రోజున మీ ఇంటి గడప ను గోమాత తొక్కడం వల్ల మీ ఇంటి లోకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని పండితులు చెబుతున్నారు. ఇక బయటకు వెళ్లేటప్పుడు కాటుక బొట్టు పెట్టుకోవడం వంటివి చేయడం వల్ల కూడా ఎవరి దృష్టి పడకుండా ఉంటుంది . కాబట్టి పైన చెప్పిన విధంగా మీరు ప్రతిరోజు పాటించడం వల్ల ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు కూడా అడుగు పెట్టలేవు. అంతే కాదు ఎవరి చెడు ప్రభావం పడకుండా.. మీ కుటుంబ సభ్యులు.. మీ కుటుంబం అంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటుంది.