Yamadharma Raju : యమలోక అధిపతి యమధర్మరాజు గురించి తెలియని రహస్యాలు ఇవే..?

Yamadharma Raju : యమధర్మరాజు.. మానవుడి ప్రాణాలను ఈయన తన గుప్పిట్లో పెట్టుకొని మానవజాతిని నడిపిస్తున్నారు అని చెప్పవచ్చు. దక్షిణ దిక్కుకు అధిపతి అయిన యమధర్మరాజు సూర్యభగవానుడు.. సంజ్ఞ దేవి ల కుమారుడు. అయితే సూర్యుడి తేజస్సు తట్టుకోలేక సంజ్ణ్యా దేవి తన ఛాయను సూర్యుని వద్ద ఉంచి పుట్టింటికి వెళ్లిపోయింది . తన పుత్రులను ప్రేమగా చూసుకుంటూ తన సంతానమైన పక్షపాతం చూపించేది. తనను నిర్లక్ష్యం చేస్తోందనే కోపంతో తల్లి సంజ్ణ్యా దేవి పై తన్నడానికి కాలు ఎత్తగా కాలు విరిగి నేలపై పడమని ఆమె శపించింది ఈ విషయాన్ని సూర్యుడికి చెప్పగా క్రిందపడిన కాలు క్రిములచే తినబడినప్పుడు శాపవిమోచనం జరుగుతుందని చెప్పాడు సూర్యభగవానుడు.

శాప భయం వల్ల ధర్మాన్ని కాపాడుతూ ఉండడంతో ధర్ముడనే పేరు వచ్చింది. యమధర్మరాజు యొక్క ధర్మ గుణం బట్టి పితృ లోకాధిపత్యం కూడా వచ్చింది. ఇక యముడి కి ఇద్దరు భార్యలు ఒకరు ధమోర్ణ మరొకరి విజయ.. చిత్రగుప్తుడు, చండుడు, లేఖరి, మహా చండుడు సంతానం.. వట వృక్షం ఆయనకు ప్రీతికరమైన వృక్షం. కుంతి యందు 4 యమునికి ధర్మరాజు జన్మించాడు.. మూడు నేత్రాలు.. నాలుగు చేతులతో.. కాల దండం.. కిరీటం.. పాశం.. అభయ వరద హస్తాలు కలిగిన యమధర్మరాజు యమలోకానికి అధిపతి అయ్యారు.

These are the unknown secrets about Yamadharma Raju
These are the unknown secrets about Yamadharma Raju

ఇకపోతే ఈయన ఎక్కువగా తన భార్య అయిన శ్యామల దేవి తోనే మహిష వాహనం ఎక్కి ఉంటాడు. మానవుల యొక్క పాపపుణ్యాలను లెక్కించి శిక్షలను అమలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మనుష్యుల జీవితకాలం భూమిపై తీరిన వెంటనే వారిని పైకి తీసుకెళ్ళి పోతాడు. జీవించి ఉన్నప్పుడు భూమిపై చేసే పాపపుణ్యాల ఆధారంగా స్వర్గానికి వెళ్లడమా లేదా నరకానికి వెళ్ళడం అనే విషయాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు యమధర్మరాజు. యమధర్మరాజు అంటే కొంతమందికి భక్తి మరి కొంత మందికి భయం.. భయం ఉన్న వారు ఖచ్చితంగా పాప పుణ్యాల గురించి ఆలోచిస్తే భూమిపై పాపం పెరిగి పోదు అని పండితులు చెబుతున్నారు.