Money Tips : నిరుద్యోగులకు సొంత ఊరు నుంచే డబ్బు సంపాదించడం ఎలా..?

Money Tips : ఇటీవల కాలంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది విద్యార్థులు తమ చదువులు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. కానీ వారి చదువుకు తగ్గట్టుగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉద్యోగం రాక ఆర్థికంగా ఇబ్బందులు పడటమే కాకుండా కుటుంబ సభ్యులతో.. చుట్టుపక్కల వారితో కూడా అవమానాల పాలవుతున్నారు. ఇక అలాంటి నిరుద్యోగులకు ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. కేవలం సొంత ఊరి నుంచే కష్టపడకుండా డబ్బు సంపాదించే బిజినెస్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది.

అదే వాటర్ ప్లాంట్ బిజినెస్.. గంటకు వెయ్యి లీటర్ల నీటిని శుభ్రం చేసే వాటర్ ప్లాంట్ కనుక ఏర్పాటు చేసినట్లయితే సుమారుగా నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు లాభాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. మన దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా మినరల్ వాటర్ కి మంచి డిమాండ్ పెరుగుతోంది. కొంచెం ఉన్నత కుటుంబం లోని వారు అయితే ముఖం కడుక్కో డానికి కూడా మినరల్ వాటర్ ఉపయోగిస్తున్న సందర్భాలు మనం చాలానే చూశాం.అంతేకాదు ఈ వ్యాపారం ఏటా 20% వృద్ది చెందుతోంది. ఇక మీరు కూడా ఇలాంటి వ్యాపారం మొదలు పెడితే మంచి లాభాలు వస్తాయి. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ ఇంటి ఆవరణంలోని ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసి మీ చుట్టుపక్కల ఉండే గ్రామాలకు అలాగే మీ ఊర్లో ఉండే ఇళ్లకు నీటిని సరఫరా చేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

How to make money from home for the unemployed
How to make money from home for the unemployed

ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే.. ముందుగా మీరు ఒక చిన్న కంపెనీని ఏర్పాటు చేయాలి. కంపెనీల చట్టం కింద దానిని నమోదు చేయించాలి..పాన్ నంబర్, GSTనంబర్ వంటి అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేస్తే.. అధికార యంత్రాంగం నుంచి లైసెన్స్, ISI నంబర్ తీసుకోవాలి. వాటర్ ప్లాంట్ కోసం.. బోరు, ఆర్‌వో ఫిల్టర్‌తో పాటు పలు యంత్రాలు అవసరం అవుతాయి. వాటిని ఏర్పాటు చేసేందుకు 1000 నుంచి 1500 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఇక ఇవన్నీ కనుక మీరు ఏర్పాటు చేసుకున్నట్లైతే ఎక్కడికి వెళ్ళకుండా అని అధిక డబ్బులు సంపాదించవచ్చు.