Central Government.. సమాజంలో పురుషులతో పాటు స్త్రీలకు కూడా అన్ని రంగాలలో ప్రభుత్వం సమాన హక్కులను కల్పిస్తోంది. ఈ క్రమంలోనే మహిళల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో రకాల పథకాలను అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా ఒకటి. ఇకపోతే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకంలో మార్పులు చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది.
ఆడపిల్లల తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి పథకంలో పెట్టుబడి పెట్టడానికి బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ లలో పొదుపు ఖాతాను ప్రారంభించవచ్చు ఇందులో 7.6% వడ్డీ లభిస్తోంది. ఇకపోతే 250 రూపాయల కనీసం మొత్తంతో ఖాతా ప్రారంభించి గరిష్టంగా ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు ఈ ఖాతాలో దాచుకోవచ్చు. ఉదాహరణకు మీరు 10 సంవత్సరాల కాలానికి 7.6% వడ్డీ రేటు తో నెలకు ₹.8,333 పెట్టుబడి పెడితే అది సంవత్సరానికి లక్ష రూపాయలు అవుతుంది. ఇక పథకం మెచ్యూర్ అయ్యే సమయానికి ₹15,29,458 మీరు పొందవచ్చు.