Satish Kaushik : ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత..!

Satish Kaushik.. సినీ ఇండస్ట్రీలో ఒకటి తరువాత మరొకటి వరుస మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నటుడు సతీష్ కౌశిక్ కూడా కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు అనుపమ్ ఖేర్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. తమ 45 ఏళ్ల స్నేహబంధం ఈరోజు ముగిసింది అంటూ ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. సతీష్ కౌశిక్ 67 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. గతంలో ఆయన కోవిడ్ బారిన పడ్డారు.. అప్పట్నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

Satish Kaushik Died as his last twitter post playing holi with richa chadha ali fazal javed akhtar mahima chaudhary - Entertainment News India - Satish Kaushik: होली के रंग में डूबे दिखे

అయితే మార్చి 7న సతీష్ కౌశిక్ తన స్నేహితులతో కలిసి హోలీ ఆడుతున్న కొన్ని చిత్రాలను కూడా సతీష్ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఈ చిత్రాలలో అతను ప్రముఖ గీత రచయిత జావిద్ అక్బర్ , సినీనటి మహిమా చౌదరి , సినీ నటుడు అలీ ఫజిల్, సినీనటి రిచా చద్దా తో కలిసి హోలీ సంతోషంగా జరుపుకున్నారు. ఇక ఈరోజు అనారోగ్య సమస్యల కారణంగా సతీష్ కౌశిక్ మరణించినట్లు అనుపమ్ ఖేర్ స్పష్టం చేశారు.https://twitter.com/AnupamPKher/status/1633615264674889728?s=20