Business Idea : తేనెటీగల పెంపకంతో లక్షల్లో ఆదాయం.. పూర్తీ వివరాలివే..?

Business Idea : సాధారణంగా తేనె ఏ కాలంలో అయినాసరే విరివిగా లభిస్తుంది. కాబట్టి వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సౌందర్యసాధనాలను మొదలుకొని ఎన్నో రకాల ఉత్పత్తులలో తేనె ను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇక తేనె ఒక కిలో చొప్పున తీసుకుంటే వెయ్యి రూపాయల చొప్పున ధర పలుకుతోంది. ఇక తేనెటీగల పెంపకం తో లక్షల్లో ఆదాయం పొందుతున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో చాలామంది వ్యాపారం చేయడానికి ఇష్టపడుతున్నారు.. కాబట్టి ఇక వ్యాపారాల ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇక మీరు కూడా ఎక్కువగా డబ్బు సంపాదించాలి అని ఆలోచిస్తున్నట్లయితే ఈ వ్యాపారం చేయడానికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు చెప్పబోయే ఈ బిజినెస్ ఐడియా తో మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి కూడా వీలు ఉంటుంది. అంతే కాదు రిస్క్ ఉండదు.. పైగా లాభాలు కూడా వుంటాయి. ఇక అదే తేనెటీగల పెంపకం..

ఇక ఈ వ్యాపారం ద్వారా మీరు చాలా డబ్బులను సంపాదించవచ్చు. ఇక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలు తెలుసుకొని.. వ్యాపారంలోకి దిగితే మంచి లాభాలతో పాటు మరెంతో మందికి ఉపాధి కలిగించిన వారు కూడా అవుతారు. ఇకపోతే ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తిగా ఇప్పుడు చదివి తెలుసుకుందాం. ఇకపోతే ఈ వ్యాపారాన్ని గ్రామంలో కానీ నగరంలో కానీ ఇలా ఎక్కడైనా సరే ఈ పని చేయడానికి సులువుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యాపారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇకపోతే తేనె ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయడం ద్వారా మంచి లాభాలను కూడా పొందవచ్చు. ఇకపోతే వ్యవసాయం అలాగే రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పంట ఉత్పాదకతను మెరుగు పరచడానికి తేనెటీగల పెంపకం అభివృద్ధి పేరుతో ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చింది. ఇందుకోసమే నేషనల్ బి బోర్డు నాబార్డ్ తో కలిసి ఇండియాలో తేనెటీగల పెంపకానికి ఆర్థిక సహాయం అందించడం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.

Business Idea in Income in lakhs with beekeeping
Business Idea in Income in lakhs with beekeeping

మీలో ఎవరైనా సరే.. డబ్బులు లేకపోయినా సరే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. ఇక మీరు వ్యాపారం మొదలు పెడుతున్నట్లు చెబితే కేంద్ర ప్రభుత్వం అందించిన పథకం ద్వారా బ్యాంకు లో లోన్ తీసుకోవచ్చు. మీరు తీసుకున్న లోన్ పై సుమారుగా 85 శాతం వరకు సబ్సిడీ కూడా లభిస్తుంది. అంటే ఉదాహరణకు మీరు లక్ష రూపాయలు లోన్ తీసుకున్నట్లయితే అందులో కేవలం 15 వేల రూపాయలు మాత్రమే మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇంత పెద్ద మొత్తంలో ఈ వ్యాపారానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది కాబట్టి నిరభ్యంతరంగా నిక్షేపంగా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. ఇక ఈ వ్యాపారం మొదలు పెట్టాలి అంటే మీరు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. కేవలం పది పెట్టెలతో కూడా మీరు ఈ వ్యాపారం మొదలు పెట్టే అవకాశం ఉంటుంది.

ఇక ఒక్కొక్క పెట్టె లో 40 కిలోల వరకు తేనె లభిస్తుంది..అంటే సుమారుగా 400 కిలోల తేనె లభిస్తుంది. ఒక కిలో తేనె మీరు కనీస సగటు ధర 500 రూపాయల చొప్పున అమ్మినా కూడా సుమారుగా 20 లక్షల రూపాయలను మీరు ఆదాయంగా పొందవచ్చు. ఇక ఒక్కో పెట్టే కోసం మీరు 3500 రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఎలా చూసుకున్నా సరే మంచి లాభం లభిస్తుంది. కాబట్టి రైతులు కూడా ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు. ఇక ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టి మంచిగా లక్షల లాభాన్ని పొందుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు అయితే ఈ వ్యాపారాన్ని ఇటీవల యువత చేయడానికి ఆకర్షితులవుతున్నారు . ఇక ఈ నేపథ్యంలో నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉద్యోగం కోసం ఎదురుచూడటం కంటే ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి లక్షల్లో వ్యాపారాలను పొందవచ్చు.