Business Idea : ఈ పూల వ్యాపారంతో అధిక లాభం.. పూర్తీ వివరాలివే..!

Business Idea : సాధారణంగా పువ్వులు అమ్మేవాడు పైకి రాడు అని చెప్తూ ఉంటారు మన పెద్ద వాళ్ళు. అయితే ఈ సామెత ఆనాటి కాలం వాళ్ళకే పరిమితమైంది. కానీ నేటి కాలంలో అత్యాధునిక పద్దతులను అవలంబిస్తూ లక్షల్లో లాభాలు పొందుతున్న వారు కూడా ఉన్నారు..ఈ నేపథ్యంలో పువ్వులు అమ్మినవాడే నేడు కోటీశ్వరుడు అవుతున్నాడు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక సాధారణంగా ఏ సీజన్లో అయినా సరే పూలకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ప్రతి రోజు పూజ చేసే వారు తప్పనిసరిగా దేవుడికి రకరకాల పూలను సమర్పిస్తూ ఉంటారు. పూలు అనేవి కేవలం పూజకు మాత్రమే కాదు మరెన్నో రకాల కార్యక్రమాలలో కూడా పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చిన్న పూజా కార్యక్రమం మొదలుకొని పెళ్లిళ్లు , పేరంటాలు, ఏదైనా గ్రాండ్ గా ఈవెంట్ చేయాలన్నా లేదా ఒక ప్రియుడు తన ప్రియురాలిని ఆనందింప చేయాలన్నా కూడా పూలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇకపోతే పువ్వులలో చాలా రకాలు ఉన్నాయి కాబట్టి వాటిలో గులాబీలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అని చెప్పవచ్చు.

గులాబీ పువ్వులలో కొన్ని వేల రకాలు ఉన్నాయని, ప్రతి పువ్వు కూడా చూసిన వారిని ఆకర్షిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే ఈ పువ్వులను చూసినట్లయితే మన మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా పూల ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక గులాబి పూలతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సౌందర్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇక అందుకే గులాబీ పూలకు ఎప్పటికప్పుడు ధర కూడా ఎక్కువగానే పలుకుతూ ఉన్నాయి. గులాబీ పూల సాగు చేస్తే పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువగా రైతులు కనకవర్షం చూస్తున్నారు. మరి తక్కువ పెట్టుబడి తో అధిక లాభాలు ఇచ్చే ఈ గులాబీ పూల వ్యాపారాన్ని ఎలా సాగు చేయాలి.. లాభం ఎలా వస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఒకసారి పూర్తిగా చదివి తెలుసుకుందాం.. ఇకపోతే ఇటీవల కాలంలో చాలా మంది ఉద్యోగానికి బదులు వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి అలాంటి వారిలో మీరు కూడా ఒకరైతే ఇక మీ కోసం ఒక చక్కటి పూల వ్యాపారాన్ని మేము మీ ముందుకు తీసుకు వచ్చాము.

business idea farmers grow roses earn lakhs
business idea farmers grow roses earn lakhs

భూమి ఉన్నవారికి ఇది మంచి ఆదాయాన్ని తీసుకువచ్చే ఒక గొప్ప ఐడియా అని చెప్పవచ్చు. సొంత భూమి లేక పోయినా సరే మిద్దె పైన లేదా మీ ఇంటి చుట్టుపక్కల కూడా పూలమొక్కల వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఉన్న వాడ్జీ గ్రామ నివాసులు ఎక్కువగా గులాబీ పూల సాగు చేస్తూ లక్షల లాభాలను పొందుతున్నారు. ఇకపోతే అక్కడి ప్రజలు కిలో పువ్వులను కేవలం రూ.4 లేదా 15 రూపాయలకు మాత్రమే విక్రయిస్తున్నారు. కానీ రాయలసీమ , కోస్తా ఆంధ్ర వంటి ప్రాంతాలలో ఈ గులాబీ పూలకు ఎక్కువగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా పండుగలు, పెళ్ళిళ్ళు వంటి అత్యవసర సీజన్లలో గులాబీ పూల ధర సుమారుగా 300 రూపాయల కిలో పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక విడి దినాలలో ఎంతలేదన్నా సరే ఖచ్చితంగా వంద రూపాయలు కిలో పలుకుతున్నాయి.

కాబట్టి ఈ వ్యాపారం రైతులకు మంచి లాభాన్ని అందిస్తుంది అని చెప్పవచ్చు. కేవలం మీరు ఎక్కువగా నీరు అవసరం లేకుండా ఈ పంటను పండించవచ్చు. ఇక నిర్వహణ ఖర్చు కూడా తక్కువ కావడంచేత పెద్దగా పెట్టుబడి ఖర్చు కూడా ఉండదు. ఇక ఎక్కువగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఇకపోతే మీరు ఒక కేజీ సగటున రెండు వందల రూపాయలు వేసుకున్నా ప్రతిరోజు ఎకరం నుంచి 30 కేజీల కు సగటున అనుకున్నా రోజుకు 6 వేల రూపాయలను సంపాదించవచ్చు.. అంటే ఉదాహరణకు తక్కువలో తక్కువ లక్షా ఎనభై వేల రూపాయలను ప్రతి నెల సంపాదించే అవకాశం ఉంటుంది. అందులో 50 వేల రూపాయలు పెట్టుబడిగా పోయినా లక్షా 30 వేల రూపాయలను మీరు పొందవచ్చు. సుమారు రెండు మూడు నెలల పాటు అతి తక్కువ సమయంలోనే అవుతారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక రైతులకు మంచి లాభాలను అందించే ఈ సాగు ఒక అద్భుతమైన ఐడియా అని చెప్పవచ్చు.