Electric Robot Car : ఇకపై నో డ్రైవర్.. సరికొత్త ఎలక్ట్రిక్ రోబో కార్.. ఫీచర్స్ తెలిస్తే షాక్..!

Electric Robot Car : చైనాలోని వాహన తయారీదారులు ఎక్కువగా అసిస్టెంట్ డ్రైవింగ్ టెక్నాలజీ అభివృద్ధికి ఎక్కువగా ఖర్చు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. డ్రైవింగ్ అసిస్టెడ్ ను నిజం చేయడానికి పోటీ పడుతున్న కంపెనీలలో బైడు, గీలీ కూడా ఉన్నాయి. ఇక బైడు నియంత్రణలోని చైనీస్ ఆటో మేకర్ గీలీ ఎలక్ట్రిక్ వెహికల్ వెంచర్ జిడు సహాయంతో ఒక రోబో ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించడం జరిగింది. బైడు, గీలీ భాగస్వామ్యానికి అంగీకరించిన తర్వాత దాదాపు ఒక సంవత్సరం క్రితం స్థాపించిన ఈ జాయింట్ వెంచర్ సీఈవో జోజియా మాట్లాడుతూ.. ఇది కేవలం కారు మాత్రమే కాదు ఒక రోబో కూడా.. ప్రారంభదశ డిజైన్ ఆలోచనలు త్వరగా నిరూపించుకోవడానికి ఉపయోగిస్తాము అని స్పష్టం చేశారు. బైడు మొదటి వాహనం యొక్క నమూనాను సీఈఓ జోజియా వివరిస్తూ డాష్ బోర్డు స్థానంలో పొడవైన స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది..

అది కారు యొక్క ముందు భాగాన్ని స్కాన్ చేస్తుంది. ఇక డ్రైవర్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ ను కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాక్ పిట్ బటన్లను తొలగించాము.. ఫ్యూచరిస్టిక్ లుకింగ్.. లాడ్జింగ్ అటానమస్ హ్యాచ్ బ్యాక్ ను రోబో వన్ అని అంటారు. ఇకపోతే కంపెనీ ప్రకారం ఈ కారు తయారు చేయడానికి కనీసం 30 వేల డాలర్లు ఖర్చు అవుతుందని.. వచ్చే ఏడాది నుంచి ఎలక్ట్రిక్ రోబో కార్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇక పోతే బైడు సెల్ఫ్ డ్రైవింగ్ ఆటో మొబైల్స్ కి ప్రమాణంగా మారవచ్చు అని జోజియా తెలిపారు. ఇక అయితే వాహనం తోపాటు డ్రైవింగ్ సాఫ్ట్ వేర్ కి ఏ స్థాయిలో సహాయం అందుతుందని మరిన్ని వివరాలు మాత్రం వారు పంచుకోకపోవడం గమనార్హం. ఇకపోతే తాజాగా అందుతున్న మరి కొన్ని నివేదికల ప్రకారం వాహనం ఆక్టివేట్ చేసేటప్పుడు సెన్సార్లు లైడార్ హుడ్ నుంచి పైకి లేస్తుంది ..ఇక ముందున్న రోడ్డు మ్యాప్ త్రీడీలో లోడ్ అవుతాయి..

The newest Electric Robot Car in features
The newest Electric Robot Car in features

చివరి మోడల్ బీజింగ్లో ప్రదర్శించిన దానితో పోలిస్తే 90% ఒకేలా ఉంటుంది అని వెల్లడించారు. అయితే ఏ అంశాలు మాత్రం తెలియజేయలేదు. మొబైల్ కనెక్షన్ ద్వారా సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. జిడు వాహనం అపోలో కస్టమైజ్డ్ వెర్షన్ ను పోలి ఉంటుందని తెలిపారు. అంతేకాదు ఈ సాఫ్ట్వేర్ ను చైనాలో డజన్లకొద్దీ కార్ల తయారీ దారులు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. చాలా రోడ్లపై స్వయంగా డ్రైవ్ చేయగలదని కూడా తెలిపారు. ఇక ఏప్రిల్ చివరి నాటికి అపోలో 16.7 మిలియన్ మైళ్లకు పైగా అటానమస్ డ్రైవింగ్ పర్యవేక్షించిన ట్లు బైడు తెలిపింది. ఇకపోతే మొబైల్ కనెక్షన్ ద్వారా సాధారణ సాఫ్ట్వేర్ అప్డేట్ ల ద్వారా క్రమపద్ధతిలో కారు ఫీచర్లను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తామని కూడా స్పష్టం చేశారు. ఇక చైనాలోని చాలా పెద్ద ఇంటర్నెట్ వ్యాపారాలు ఏదో ఒక పద్ధతిలో ఆటోమోటివ్ టెక్నాలజీని సృష్టిస్తున్నాయి.

ఇక బైడు ఎలక్ట్రిక్ వాహనం రంగంలోకి ప్రవేశించడం అనేది ఈ కంపెనీ దృష్టిని ప్రకటన నుంచి దూరంగా అటానమస్ డ్రైవింగ్ కృత్రిమ మేధస్సు వంటి కొత్త అభివృద్ధి రంగాల్లో కి మార్చడానికి చర్యలు తీసుకుంటున్నారు. చైనాలో సాంకేతిక వ్యాపారాలు మార్కెట్లోకి ప్రవేశించిన ధోరణి కూడా కనబడుతోంది. ఇక ఈ క్రమంలోనే షియోమీ టెలికామ్ సంస్థ గత ఏడాది తన సొంత ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ లో 2024 మొదటి అర్ధ భాగంలో భారీ ఉత్పత్తిని ప్రారంభించాలని ఆశయంతో రాబోయే పది సంవత్సరాలలో తన సొంత ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ 10 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని ఆశిస్తున్నట్లు జో జియా వెల్లడించారు. మొత్తానికి అయితే మరో రెండు సంవత్సరాలలో సెల్ఫ్ డ్రైవింగ్ చేసే రోబో ఎలక్ట్రిక్ కార్లను మనం చూడవచ్చు . ఇక ఇండియన్ మార్కెట్లోకి రావడానికి మరొక సంవత్సరం సమయం పట్టినా ఖచ్చితంగా త్వరలోనే సెల్ఫ్ డ్రైవింగ్ తో ..ఇక పై డ్రైవర్ అవసరం లేకుండా కార్లలో సరికొత్త టెక్నాలజీని మనం చూడవచ్చు.