New Scooters : డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా నడపగలిగే స్కూటర్స్ ఇవే.. ఫీచర్స్ తెలిస్తే షాక్..!!

New Scooters : New Scootersకేవలం మన భారత దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా సరే రోడ్డు పైన ఒక వెహికల్ ని మనం నడపాలి అంటే.. కచ్చితంగా ఆ వెహికల్ కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ మన దగ్గర తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే చట్టరీత్యా నేరం గా పరిగణించి పోలీసుశాఖ మన పై జరిమానా కూడా విధించవచ్చు. అయితే ఇండియా లో కొన్ని రకాల వాహనాలను డ్రైవ్ చేయడానికి లైసెన్స్ అవసరం లేకుండా వాహన తయారీ సంస్థలు సరికొత్త ఫీచర్స్ తో కొన్ని రకాల ద్విచక్ర వాహనాలను భారత మార్కెట్లోకి ప్రవేశ పెట్టడం జరిగింది. వినడానికి ఆశ్చర్యకరంగా అనిపించినా.. ఈ వాహనాల గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే. మరి ఆ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఆ స్కూటర్స్ ఏంటి.. వాటి ఫీచర్స్ ఏమిటో ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.

మన భారతదేశంలో చాలా వరకు రోడ్ లో అతి పెద్ద ట్రక్కుల నుంచి చిన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు నిండి ఉంటాయి . భారత దేశ చట్టాల ఆధారంగా డ్రైవ్ చేస్తున్న వెహికల్ ఆధారంగా లైసెన్స్ అనేది తప్పనిసరి వుండాలి. ఉదాహరణకు మన అవసరాలకు తగ్గట్టుగా హెవీ మోటార్ వెహికల్ లేదా లైట్ మోటార్ వెహికల్ వంటి వాటికి లైసెన్సులు అవసరమవుతాయి . అయితే ఎటువంటి అధికారిక లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయగలగే స్కూటర్ లు కూడా కొన్ని అందుబాటులోకి రావడం గమనార్హం. ఇక ఈ నిబంధనల ప్రకారం భారతీయులు ఎటువంటి ప్రత్యేక పర్మిట్లు లేకుండా కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు కూడా డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రత్యేకంగా చెప్పాలి అంటే గరిష్ఠంగా 25 Kmph వేగంతో 250 వాట్ల గరిష్ట పవర్ అవుట్ పుట్ కలిగిన ఎలక్ట్రిక్ బైక్ లను మీరు నడపవచ్చు. ఇక వీటికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ముఖ్యంగా ఇలా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేకుండా నడపగలిగే వాహనాలు ఏమిటి అంటే..

AMO electric bikes company launches Janti Pro New Scooters
AMO electric bikes company launches Janti Pro New Scooters

హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ ఈ -2 : ఈ ఎలక్ట్రిక్ వెహికల్ డ్రైవ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఏమాత్రం అవసరం లేదు. ఈ స్కూటర్ కేవలం 48 వోల్ట్, 28 Ah లిథియం అయాన్ బ్యాటరీ పై 250 వాట్ ఎలక్ట్రిక్ మోటార్ నుంచి శక్తిని తీసుకుంటుంది. ఇక గరిష్ఠంగా 25 Kmph వేగాన్ని అందుకుంటుంది. ఇక ఈ స్కూటర్ బరువు కేవలం 69 కేజీలు మాత్రమే. ఇక దీని ధర ప్రస్తుతం మార్కెట్ లో రూ.59,099 గా నిర్ణయించబడింది. ఇక సామాన్యులు కూడా ఈ ఎలక్ట్రిక్ బైకును కొనుగోలు చేయవచ్చు. అలాగే 18 సంవత్సరాలు నిండిన కాలేజీ అమ్మాయిలు కూడా నిరభ్యంతరంగా ఈ స్కూటర్ ను నడపవచ్చు.

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ఈ -5 : ఇక ఈ స్కూటర్ కూడా 250 వాట్ ఎలక్ట్రిక్ హబ్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇక ఫ్లోర్ బోర్డులో ఇన్స్టాల్ చేసిన లిథియం అయాన్ / లీడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ ఐదు గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇక ఒక్కసారి ఛార్జ్ చేస్తే 55 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది.ఒక గంటకు 42 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

హాప్ లియో : అడ్వాన్స్డ్ ఫీచర్లతో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ లలో ఇది కూడా ఒకటి. ఇది ఛార్జింగ్ , ఆటోమేటిక్ పార్కింగ్, అసిస్టెన్స్ తోపాటు సైడ్ స్టాండ్ సెన్సారు రిమోట్ కి యాంటీ – థెఫ్ట్ అలారం , GPS వంటి ఇతర ఫీచర్లతో కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్కూటర్ ఫుల్ చార్జింగ్ పై 70 నుండి 125 km దూరం కూడా ప్రయాణిస్తుంది.

జాంటీ ప్రో : AMO ఎలక్ట్రిక్ బైక్స్ సంస్థ జాంటీ ప్రో స్కూటర్ ను లాంచ్ చేసింది. ఇకపోతే ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్.. ఆకర్షణీయమైన హెడ్ల్యాంప్స్ లు కూడా ఉన్నాయి. ఇక 249 వాట్ ఎలక్ట్రిక్ మోటార్ పై ఈ స్కూటర్ రన్ అవుతుంది. 75 కిలోమీటర్ల వరకు ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రయాణించగలదు. ఇక గరిష్ట వేగం గంటకు 25 కిలో మీటర్లు.. ఇక ఆరు గంటలలో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.