iPhone : ఐఫోన్ కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. సరికొత్త ఫీచర్లతో.. భారీ డిస్కౌంట్ తో..!!

iPhone : ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్ కలిగిన ఏకైక ఫోన్ ఐఫోన్ అని చెప్పవచ్చు . ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది వీటి ఫీచర్స్ కి ఆకర్షితులై కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే సామాన్యుడికి మాత్రం ఐఫోన్ అందనంత దూరంగానే ఉండిపోయింది .ఎందుకంటే వేల రూపాయల విలువ చేసే ఈ ఐఫోన్ సామాన్యుడు కొనుగోలు చేయాలి అంటే అత్యంత భారంగా మారింది. ఐఫోన్ కొనాలనే కోరిక ఉన్నా ధర చూసి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. అయితే ఐఫోన్ లు అనేవి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలని నేపథ్యంలో ఐఫోన్ మొబైల్ తయారీ సంస్థలు కూడా రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇకపోతే ఐఫోన్ సంస్థ అందిస్తున్న ఆఫర్లతో ప్రస్తుతం సామాన్యుడు కూడా ఈ మొబైల్ ను కొనవచ్చు. మరి ఆపిల్ సంస్థ అందిస్తున్న పలురకాల ఐ ఫోన్ ల గురించి.. వాటి ఫీచర్ల గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆపిల్ సంస్థ అందిస్తున్న స్మార్ట్ ఫోన్ లలో ఆన్లైన్ షాపింగ్.. రిటైల్ కంపెనీ క్రోమా ప్రీమియం ఫోన్ల పై కళ్లుచెదిరే ఆఫర్లను ప్రకటించింది.

ప్రస్తుతం క్రోమ్ ఫోన్ 12 ఐ ఫోన్ 64 జీబీ వేరియంట్ తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా 14 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం. ఆఫ్ లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఎలా కొనుగోలు చేసినా సరే ఇన్స్టెంట్ గా 14 శాతం డిస్కౌంట్ లభించడం గమనార్హం. ఇకపోతే ప్రముఖ టెక్ దిగ్గజం అయిన యాపిల్ రీసెంట్ సంవత్సరాలలో లాంచ్ చేసిన పై ఫోన్ల ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ ఇండియా ఐ స్టోర్.. అమెజాన్ వంటి పలు ఆన్లైన్ సెల్లర్స్.. ఆకర్షణీయమైన డిస్కౌంట్లు తో పాటు డీల్స్ తో స్మార్ట్ ఫోన్ లపై సరసమైన ధరలకు విక్రయిస్తూ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ షాపింగ్ రిటైల్ కంపెనీ క్రోమా కూడా ఈ ప్రీమియం ఫోన్ల పై కళ్ళు చెదిరే డిస్కౌంట్ ప్రకటించింది. ఇకపోతే క్రోమా ఐ ఫోన్ 12 మొబైల్ 64gb వేరియంట్ పై 14 శాతం ఇన్స్టంట్ స్టోరీ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తూ ఉండగా 64gb ఫోన్ అసలు ధర 65,900 గా ఉంది. 14 శాతం డిస్కౌంట్ తో రూ.8,910 తగ్గి కేవలం 56,990 కే లభించనుంది. ముఖ్యంగా కొనుగోలుదారులకు మూడు వేల రూపాయల వరకు అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంటుంది

Bumper offer is the newest feature for those who want to buy an iPhone
Bumper offer is the newest feature for those who want to buy an iPhone

ముఖ్యంగా దీని ధర మరింత తగ్గించడానికి ఇతర బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులోకి రావడం గమనార్హం. ఇకపోతే క్రోమా కంపెనీ ఐఫోన్ 12 ఇంకా ఎంత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి చదువు తెలుసుకుందాం.. ఈ మొబైల్ పై 14 శాతం ఇన్స్టంట్ స్టోర్ డిస్కౌంట్ తో పాటు మూడు వేల రూపాయలు అదనంగా క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డు కొనుగోలుదారులకు ఏకంగా ఆరు నెలల వరకు నో కాస్ట్ ఇఎంఐ ఫెసిలిటీ ని కూడా అందించడం జరుగుతోంది. ఇక మీరు మీ పాత ఐఫోన్ మోడల్ లేదా ఇతర ఫోన్ లను ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల కూడా మీరు డబ్బును సేవ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ టీచర్ల విషయానికి వస్తే.. బెజెల్ – లెస్ 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డి ఆర్ డిస్ప్లే తోపాటు 4gb ram 64gb rom తోపాటు ఐఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే హెక్సా కోర్ A14 బయోనిక్ ప్రాసెసర్ తో పాటు.. 12 MP + 12MP రియర్ కెమెరా లు.. అలాగే 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు అమర్చబడి ఉంది ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే 2815 ఎన్ హెచ్ లిథియం అయాన్ బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లను అందించారు. ఇక 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వైర్లెస్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది.

Advertisement