Health Benefits : చెట్టు పండ్లే కాదు ఆకులను కూడా వదిలిపెట్టండి.. ఎన్ని లాభాలో..!

Health Benefits : రేగు పండ్లు తెలియని వారు ఉండవు. పల్లెటూర్లో ఈ పండ్లు విరివిగా లభిస్తాయి.. పుల్ల పుల్లగా తియ్యతియ్యగా ఉండే ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే.. కానీ రేగు ఆకులులో దాగి ఉన్న పోషక విలువల గురించి ఎక్కువ మందికి తెలియదు.. చిన్న రేగు పండ్ల చెట్టు ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ఈ ఆకులు ఎటువంటి అనారోగ్య సమస్యలను నయం చేస్తాయంటే..!? చిన్న రేగుపండు చెట్టు ఆకులను ప్రతిరోజు 5 చొప్పున నమిలి తింటే గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. జీర్ణశయాన్ని క్లీన్ గా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను తొలగిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు రెండు ఈ ఆకులను తింటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. రేగు ఆకుల కషాయం గొంతునొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది. రేగు ఆకులను మెత్తగా దంచుకోవాలి. ఒక కప్పు నీటిలో ఈ ఆకుల పేస్ట్ వేసి బాగా మరిగించాలి.

ఆ తరువాత మరొక గ్లాసు లోకి వడ పోసుకొని అందులో చిటికెడు ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. ఈ కషాయం తాగితే గొంతు నొప్పి తగ్గిపోతుంది. ఈ ఆకుల కషాయం తాగితే మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ ను తొలగిస్తుంది. రేగు ఆకులను మెత్తగా దంచి ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వడగట్టి పరగడుపున నీటిని తాగాలి. ఇలా వరుసగా కొన్ని రోజులపాటు చేస్తూ ఉంటే బరువు తగ్గుతారు . శరీరం నాజూగ్గా మారుతుంది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారికి ఈ ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుంది. గాయాలు, పుండ్లు ఉన్నచోట రేగు ఆకులు ముద్దగా నూరి ఆ మిశ్రమం రాసి కట్టు కట్టి ఉంచాలి. ఇలా చేస్తే వాపు తగ్గి త్వరగా గాయం నయం అవుతుంది. మీ కళ్ళలో మొటిమలు లేదా కావీటీస్ ఉంటే రేగు ఆకుల రసం కంటి బయట భాగంలో రాయాలి. ఇలా చేస్తూ ఉంటే కంటి మొటిమలను తగ్గిస్తుంది.

Excellent Health Benefits Of Jujube ber plant Leaves
Excellent Health Benefits Of Jujube ber plant Leaves

జలుబు, దగ్గు ఉన్నవారు ప్రతి రోజు రెండు రేగు ఆకులను నమిలి తింటే సమస్య త్వరగా తగ్గిపోతుంది. ఈ ఆకులను తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తం వృద్ధి చెందుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. ఈ ఆకులు క్యాన్సర్లను అడ్డుకుంటాయి. కొత్త కణాలు ఏర్పడకుండా చేస్తాయి. రేగు ఆకులు మొటిమలు, చుండ్రు సమస్యను నివారిస్తాయి. రేగు ఆకులను ముద్దగా దంచి అందులో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే మొటిమలు తగ్గిపోతాయి. రేగు ఆకుల పేస్టు లో కొద్దిగా పెరుగు కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. అరగంట తరువాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రును నివారిస్తుంది. ఇంత చక్కటి విషయాలను మీ మిత్రులతో పంచుకోవడం మర్చిపోకండి.