Health Benefits : ఈ మొక్క విత్తనాల గురించి ఈ రహస్యం తెలుసుకుంటే మీరు పాటిస్తారు.!

Health Benefits : హైందవ సంస్కృతి లో తులసి మొక్క కు విశిష్ట స్థానం ఉంది.. తులసి ఆకులను దైవారాధన కు ఉపయోగిస్తారు.. ఆయుర్వేద వైద్యంలో కూడా తులసి కి చాలా ప్రత్యేకత ఉంది.. పూర్వకాలం నుంచి ఈ చెట్టు ఆకులను పలు రకాల ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు.. సాధారణంగా తులసి ఆకులను నమిలి తినడం వలన కలిగే ప్రయోజనాలు మనలో చాలా మందికి తెలుసు.. తులసి ఆకులే కాకుండా తులసి చెట్టు విత్తనాలలో కూడా బోలెడు ఔషధల గుణాలను కలిగి ఉంది. ఈ గింజలను ఏ విధంగా తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలను నయం చేస్తుందో ఇప్పుడు చూద్దాం..! తులసి గింజల ప్రొటీన్, ఫైబర్, ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఈ విత్తనాలలో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. దీంతో తరచుగా వచ్చే వ్యాధుల నుంచి తులసి విత్తనాలు మనల్ని రక్షిస్తాయి.

ముందుగా తులసి గింజలను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని పాలల్లో కలిపి ప్రతిరోజూ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది రక్తనాళాల్లో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. తులసి గింజల ఐరన్ విటమిన్ కె ఉన్నాయి. ఈ గింజలను నీటిలో నానబెట్టి తీసుకుంటే రక్తహీనత సమస్య కు చెక్ పెడతాయి. ఈ విత్తనాలను నీటిలో నానబెట్టి ప్రతి రోజూ తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. దాంతో గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోవడం తోపాటు మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తాయి. ఈ గింజలు తీసుకుంటే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని పలు పరిశోధనలలో తేలింది. శరీరంలోని కణజాలాన్ని నాశనం చేసే ఫ్రీరాడికల్స్ ను అడ్డుకుంటాయి. శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి. కొత్త కణాలు ఏర్పడకుండా ఉంటాయి. క్యాన్సర్ రాకుండా మనల్ని రక్షిస్తుంది.

Health Benefits Of Basil Plant Seeds
Health Benefits Of Basil Plant Seeds

తులసి విత్తనాలను నీటిలో నానబెట్టుకుని తినటం వలన బరువు తగ్గుతారు. నీటిలో నానిన ఈ విత్తనాలలో కొద్దిగా పెసర పప్పు, బెల్లం కలిపి ప్రతి రోజు తింటే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. ఈ గింజలు తరచూ తీసుకోవడం వల్ల శారీరక అలసట ను తొలగిస్తాయి. ఒత్తిడి , ఆందోళన, టెన్షన్ ను దూరం చేసి మానసిక ప్రశాంతతను అందిస్తాయి. హాయిగా నిద్ర పట్టేలా చేస్తాయి. నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. తులసి విత్తనాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో కొల్లాజెన్ పెరుగుతుంది. ఇది చర్మ కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మం ముడతలు పడకుండా ఈ గింజలు అడ్డుకుంటాయి. మనం నిత్య యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. తెలుసుకున్నారు కదా తులసి విత్తనాల వలన ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ ని మీ మిత్రులతో కూడా పంచుకోండి.