Health Benefits : బంగారం కంటే విలువైన ఈ మొక్క ఆకులు కనిపిస్తే అస్సలు వదలకండి..

Health Benefits : నీలి చెట్టును మనం నిత్యం చూస్తూనే ఉంటాం.. సుమారు రెండు మీటర్ల ఎత్తులో చిన్న పొదలా ఉండి అందమైన గులాబీ రంగు పూలను ఇస్తుంది.. ఈ మొక్క చూడటానికి వేంపల్లి చెట్టులా ఉంటుంది. కాకపోతే ఈ చెట్టు ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.. వీటి కాయలు కూడా ఒక అంగుళం పొడవు లో ముదురు రంగులో ఉంటాయి.. ఈ చెట్టు ఆకులు చేదుగా ఉన్నప్పటికీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి..! నీలిమొక్క వలన కలిగే లాభాలెమిటో ఇప్పుడు తెలుసుకుందాం..! నీలిమొక్క ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని సమాన మోతాదులో వేపనూనె కలిపి కుష్టు వ్యాధి ఉన్నవారు రాసుకుంటే కుష్టు వ్యాధి నయమవుతుంది. గజ్జి, తామర, దురద వంటి చర్మ సమస్యలను ఈ ఆకుల రసం లేపనంగా రాసుకుంటే నయం అవుతుంది. పిప్పి పళ్ళు సమస్యతో బాధపడుతున్న వారు ఈ చెట్టు ఆకులను నలిపి చిన్న ఉండలుగా చేసుకోవాలి.

సమస్య ఉన్న చోట ఈ ఆకుల మిశ్రమం ఉంచి పై పళ్ళతో నొక్కి ఉంచాలి. ఈ ఆకుల రసం పిప్పిపన్ను లోపలికి వెళ్లి లోపల ఉండే పురుగులు, బ్యాక్టీరియాను చంపేస్తుంది. దాంతో పిప్పి పన్ను నొప్పి తగ్గటంతో పాటు పిప్పి పళ్ళు కూడా తగ్గిపోతాయి. దంతాల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. నల్లటి ఒత్తయిన కురుల కోసం ఈ ఆకుల ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. నీలి మొక్క ఆకులు జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతాయి. ఈ చెట్టు ఆకులతో తయారు చేసిన నూనెను జుట్టు కుదుళ్లకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది. జుట్టును మృదువుగా చేస్తుంది. ఈ ఆయిల్ తో మసాజ్ చేస్తే కొత్త జుట్టు వస్తుంది.

Health and Hair Benefits of Indigo Plant
Health and Hair Benefits of Indigo Plant

జుట్టు రాలడాన్ని అరికడుతుంది. ఇంకా చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. చుండ్రుతో పాటు వచ్చే దురదను కూడా పోగొడుతుంది. నీలి ఆకుల రసం పాము కాటు, తేలు కాటుకు విరుగుడుగా పనిచేస్తుంది. ఈ ఆకుల రసాన్ని 40 ML మోతాదులో ప్రతి రెండు గంటలకు ఒకసారి తీసుకుంటే విషయం శరీరానికి విషం ఎక్కకుండా చేస్తుంది. నీలి మొక్కకు విషాన్ని విరిచేసి ప్రాణాలను రక్షించే గుణాలను కలిగి ఉంది. ఈ ఆకుల రసాన్ని ప్రతిరోజూ 20ML మోతాదులో తీసుకుంటే లివర్ సమస్యలు తగ్గుతాయి. హైపటైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తుంది. కాకపోతే సమస్య తగ్గేంతవరకు ఈ ఆకుల రసం తీసుకోవాలని గుర్తుంచుకోండి. ఈ ఆకుల రసం తీసుకుంటే మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి మూత్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.