Abhimanyu : అభిమన్యుడు పద్మవ్యూహం లోకి వెళ్లి.. ఎందుకు తిరిగి రాలేదు..?

Abhimanyu  : మహాభారతంలో అతి పెద్ద యుద్ధం కురుక్షేత్రం. ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశం కురుక్షేత్రం. ఇప్పటికీ ఈ ప్రదేశం ఢిల్లీకి దగ్గరలో ఉంది. ఈ కురుక్షేత్ర యుద్ధం కౌరవులకు , పాండవులకు మధ్య జరిగిన రాజ్య పోరు. ఈ మహా యుద్ధం 18 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా జరిగింది. లక్షలాది మంది మృత్యువుతో పోరాడి వీరమరణం చెందుతున్నారు. రక్తం ఏరులై పారింది..ఇలాంటి పెద్ద సంగ్రామంలో కి 17 ఏళ్ల బాలుడు అయిన అభిమన్యుడు ఎలా సమీపించాడో ఏ విధముగా నిరాటంకంగా పోరాడాడో తెలుసా..? కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు పాండవులను సంహరించడానికి పద్మవ్యూహాన్ని పన్నుతాడు. ద్రోణాచార్యుడు పన్నిన పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వెళ్లి విరోచితంగా పోరాడి వీరమరణం పొందుతాడు. కురుక్షేత్రంలో మనకు తెలిసినది పద్మవ్యూహం మాత్రమే . ఇంకా చాల వ్యూహాలు ఉన్నాయి. ఒక వ్యూహం అనగా యుద్ధంలో పోరాడే యుద్ధ విధానం.యుద్ధంలో మన దగ్గర సైన్యం కన్నా ఎదుటి వారి దగ్గర ఎక్కువగా సైన్యం ఉన్నప్పుడు యుద్ధ విద్యలో జ్ఞానం కలిగిన వారు వ్యూహలను రచిస్తారు. వ్యూహం శత్రువులను మైమరపించి మన సైన్యం బలికాకుండా చూసుకొని యుద్ధం గెలిచేలా రక్షించుకుంటారు.

కురుక్షేత్ర యుద్ధం లో క్రౌంచవ్యూహం, మకర వ్యూహం,కూర్మ వ్యూహం, శకట వ్యూహం,సూచి వ్యూహం, వజ్ర వ్యూహం,సర్వతోభద్ర వ్యూహం మండలార్త వ్యూహం, శృంగాటక వ్యూహం ఇలా అనేక రకాల పేర్లతో వ్యూహాలు రచించారు ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బతీయడానికి ఉపయోగపడితే .. ఈ వ్యూహాలు తమని తాము రక్షించుకునేందుకు ఉపయోగపడతాయి. 18 రోజులు భీకరంగా సాగిన కురుక్షేత్రంలో కష్టమైనది పద్మవ్యూహం.ఇలాంటి పద్మవ్యూహంలోకి వెళ్లడం అభిమన్యుడికి మాత్రమే తెలుసని అందరూ అనుకుంటారు. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధ విద్యలు గురించి తెలుపుతూ పద్మ వ్యూహం కష్టతరమైనదని చెబుతూ ఉంటాడు. వ్యూహంలో ఎలా ప్రవేశించాలి ఎలా పోరాడాలో చెబుతూ ఉంటాడు. అదే సమయంలో సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఈ యుద్ధ విద్యలన్నీ వింటూ నేర్చుకుంటూ ఉంటాడు. పద్మవ్యూహం లోకి వెళ్లి పోరాడడం చెప్పిన అర్జునుడు బయటికి రావడం చెప్పలేదు. కారణం అప్పుడే సుభద్ర నిద్రలోకి జారుకోవడం వల్ల అర్జునుడు చెప్పడం ఆపేస్తాడని అందరికీ తెలిసినదే. కానీ అభిమన్యుడు పద్మవ్యూహంలో ఎంత వీరోచితంగా పోరాడాడో లోపలికి వెళ్ళాడో తెలుసుకుందాము.

Abhimanyu went into Padmavyuham and wondered why he did not come back
Abhimanyu went into Padmavyuham and wondered why he did not come back

పద్మవ్యూహం అనేది 7 వలయాలా రూపం. ఇందులో ఒక్కొక్క వలయాన్ని తొలగించుకుంటూ వెళ్లి.. మనిషి మధ్యలో కి వెళ్ళిన తర్వాత మూకుమ్మడిగా దాడి చేసి వధించడం. ఇందులో కి ప్రవేశించిన అభిమన్యుడికి మిగిలిన పాండవులు సహాయం చేయలేక పోతారు. కారణం ఏదయినా ఒక రోజు యుద్ధం చేయడాన్ని అడ్డుకొనే వరం కలిగిన సైందవుడు అడ్డుకోవడం వల్ల సైందవుడు కౌరావుల సోదరి అయిన దుస్సల భర్త. సైంధవుడు స్త్రీలోలుడు, పాండవులు వనవాసం లో చేసేటప్పుడు పాండవులు లేని సమయం చూసి సుభద్రను అపహరించడానికి చూస్తే పాండవులు గమనించి ఇతనికి గుండు కొట్టించి అవమానిస్తారు . దీనితో కోపం పెంచుకున్న సైంధవుడు ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం బొటనవేలు భూమిపై ఉంచి తపస్సు చేస్తాడు. ఈ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు అతనికి వరం కోరుకోమని చెబుతాడు. సైంధవుడు పాండవులను ఒకరోజు పాటు యుద్ధం చేయకుండా ఆపే శక్తి ఇవ్వమని కోరుతాడు. ఆ పరమేశ్వరుడు ఒక అర్జునుని తప్ప ఎవరినైనా ఆపే శక్తి ఇస్తాడు. అందువల్ల సైంధవుడు పాండవులను యుద్ధం చేయకుండా ఒకరోజు ఆపేస్తాడు.

అందువల్ల మిగిలిన పాండవులు అభిమన్యుడు కి సహాయం చేయలేక పోతారు. అభిమన్యు కౌరావులందరితో వీరోచితంగా పోరాడి లక్ష్మణ కుమారుని చంపి విరోచితంగా పోరాడుతాడు. కూరుక్షేత్రంలో 11వ రోజు అర్జునుడు లేని సమయంలో పద్మవ్యూహం లోకి వెళ్లడం పాండవులకు సాధ్యంకాదు.పద్మ వ్యూహంలో కి వెళ్లడం కేవలం కృష్ణుడికి,అర్జునుడికి, అభిమన్యుడికి మాత్రమే సాధ్యం అని ధర్మరాజు కి తెలుసు . అందువల్ల అభిమన్యుని పద్మవ్యూహంలోకి పంపిస్తాడు. సుమిత్ అనే సారధి తో కలసి వ్యూహం లోకీ ప్రవేశించి కారు చిచ్చు కమ్మివేసినట్టు కౌరవులను చిల్చి చెండాడుతున్నాడు. అభిమన్యుని ధాటికి పద్మవ్యూహం అశ్వత్థామ,కృతవర్మ బృహద్బలుడు, కర్ణుడు మొదలైన ప్రముఖ యోధులు ఒకరిని నోరు తెరుచుకుని ధైర్యం చెప్పుకుంటూ అభిమన్యుని ఎదుర్కొన్నారు. అభిమన్యుడు సాక్షాత్తు అర్జునుడే అక్కడ ఉన్నట్లు భ్రమ కలిగిస్తూ బాణాల వర్షం కురిపించాడు. అభిమన్యుడు పారిపోతున్నవారిని వెంటపడి వేటాడాడు. ఇవన్నీ చూసిన కౌరవ సేన అభిమన్యుడిని పై ఒక్కసారిగా బాణాల వర్షం కురిపించారు. ఈ బాణాల వర్షంలో అభిమన్యుడు రథం కనిపించలేదు. అభిమన్యుడు మరణించాడని సుయోధనుడు భ…