Breaking: మిస్టర్ కూల్ ధోనీపై అంపైర్ విమర్శలు.. పెనుదుమారాన్ని సృష్టిస్తున్న వైనం!

మాజీ క్రికెటర్, ఐసీసీ అంపైర్ హార్పర్ మిస్టర్ కూల్ ధోనీపై విమర్శలు గుప్పించారు. క్వాలిఫయర్-1లో ప్రతిరణతో 16వ ఓవర్ వేయించేందుకు ధోనీ సమయం ఎంతగానో వృథా చేశారని, ఇది కొనియాడదగ్గ విషయం కాదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు క్రీడా చట్టాల కంటే, క్రీడా స్ఫూర్తి కంటే పెద్దవాళ్లలాగా ఫీల్ అవుతూ వుంటారు అని పరోక్షంగా మాట్లాడాడు. ఓ మ్యాచ్ గెలవడానికి ధోనీ లాంటి వ్యక్తి ఇలా ప్రవర్తించడం నన్ను తీవ్రంగా బాధించింది. సిచ్యుయేషన్ కంట్రోల్ చేయకుండా అంపైర్లు నవ్వుతూ నిలబడ్డారు. ఇది ఎంతమాత్రమూ సమంజసం కాదు… అంటూ కామెంట్ చేశారు.

కాగా, ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే నిన్న ఆస్ట్రేలియా, సీఎస్కే మాజీ ప్లేయర్ మాథ్యూ హేడెన్, మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీపై ప్రశంసలజల్లు కురిపించాడు. ధోని ఓ చెత్తను తీసుకొని కూడా ఓ నిధిగా మార్చగలడని హేడెన్ అనడం విశేషం. గతేడాది ఐపీఎల్లో 9వ స్థానంలో నిలిచిన CSK.. ఈసారి అద్భుతంగా పుంజుకొని, పదోసారి ఫైనల్ చేరడంలో కెప్టెన్ గా ధోనీ వ్యూహాలు బలంగా పనిచేసాయి. ఈ క్రమంలోనే అయన ఈ విధంగా స్పందించారు.