Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా సినిమా కోసం ఘట్టమనేని ఫాన్స్ చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న విషయం ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ని చూస్తేనే అర్ధం అయిపోతోంది. చాలా కాలం తర్వాత మరోసారి మహేష్ మాస్ పాత్రలో అలరించనున్నాడని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రావడంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు నటిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఇక ఈ సినిమాలో మన జగపతిబాబు విలనిజం నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మహేష్ – జగపతి బాబు కాంబినేషన్లో వచ్చే సీన్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టిస్తాయని భోగట్టా. కాగా ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్‌ను దర్శకుడు త్రివిక్రమ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారట. గతంలో వచ్చిన ‘అరవింద సమేత’ సినిమాలో జగపతిబాబును చేసిన బసిరెడ్డి పాత్రను మించి ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో జగపతిబాబులోపాటు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జయరాం కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాలో పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తోన్న విషయం మీకు తెలిసిందే. కాగా ఈమధ్యనే త్రివిక్రమ్, మహేష్ బాబుల మోస్ట్ అవైటెడ్ సినిమా #SSMB28 విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 13వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.
ఇకపోతే, ఈ మధ్యన ఇచ్చిన ఓ మీడియా ఇంటర్వ్యూలో జగపతిబాబు హీరో మహేష్ పైన చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఇంతవరకు తాను నటించిన హీరోలలో మహేష్ బాబుతో నటించడం తనకు చాలా కంఫర్ట్ గా అనిపించిందని అన్నారు. అంతేకాకుండా మహేష్ తో కలిసి నటించడమంటే కత్తిమీద సామే అని అన్నారు. తండ్రిగా చేస్తే ఓకే గాని, ఈ సారి విలన్ రోల్ చేయాల్సి వచ్చింది. దాంతో చాలా కసరత్తులు చేయాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు.