హీరో మహేష్ బాబుపై మనసు పారేసుకున్న రష్మి గౌతమ్?

రష్మీ గౌతమ్ గురించి కొత్తగా మన తెలుగు కుర్రాళ్లకు పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్థానం అనే సినిమాతో ఆమె ప్రస్థానం మొదలైందని చెప్పుకోవచ్చు. ఆ తరువాత కాలంలో ఆమె చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో టెలివిజన్ ప్రెజెంటర్ గా మారింది. ఈ క్రమంలో ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగు టెలివిజన్ కామెడీ షో ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను హోస్ట్ చేసి తన పాపులారిటీని మరింత పెంచుకుందని చెప్పుకోవచ్చు.


ఆ షో మాత్రమే కాకుండా రియాలిటీ డ్యాన్స్ షో ‘ఢీ’లో కాన్సెప్ట్ టీమ్ లీడర్ గా పని చేసింది. అలా మంచి మైలేజి సంపాదించిన తరువాత మరలా సినిమాల వైపుకి వెళుతూ లీడ్ రోల్స్ లో మెరిసింది. ఇక ఆమె ఎన్ని సినిమాలలో నటించినప్పటికీ ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ షోలో వచ్చిన మంచి పేరు మారేదాంట్లో రాలేదని చెప్పుకోవచ్చు. కాగా ఆమె ఇటీవల ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ తన మనసులోని విషయాలను వెల్లడించింది.

సదరు యాంకర్ ఆమె సినిమా జీవితాన్ని ఉద్దేశిస్తూ… టాలీవుడ్లో వున్న ఇప్పటి హీరోలలో ఎవరితో అవకాశం వస్తే నటిస్తావు? అని అడగగా ఆమె చాలా ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ… “అవకాశం వస్తే ఎవరితోనైనా నటించడానికి సిద్ధంగా వున్నాను. అయితే ఆ అవకాశం సూపర్ స్టార్ మహేష్ బాబుతో వస్తే ఎంతో అదృష్టంగా భావిస్తాను. నా కలల హీరో అతనే. అతని సినిమాలో ఓ సైడ్ రోల్స్ లో నటించామన్నా నటిస్తాను” అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

ఇకపోతే రష్మీ గౌతమ్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. కాగా ఆమె క్రాస్ బ్రీడ్ అని చెప్పుకోవచ్చు. ఆమె తల్లి ఒరిస్సాకి సంబందించినది అయితే తండ్రి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వాడు. ఇక ఆమె తెలుగులో మొదటగా 2010లో ప్రస్థానం సినిమాలో సహాయక పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత 2011 తమిళ చిత్రం ‘కండెన్‌’లో నర్మద అనే ప్రధాన పాత్రలో నటించగా ఆ సినిమా ఎందుకో కార్యరూపం దాల్చలేదు. తరువాత ఆమె కన్నడ చిత్రం ‘గురు’లో నటించింది.