Breaking: కాంతార 2 వస్తుంది..

Breaking: కన్నడంలో రూపొందిన చిన్న బడ్జెట్ చిత్రం కాంతార.. కానీ ఊహించని రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.. బాక్స్ ఆఫీస్ వద్ద ఊచ కోత కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అవ్వగా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది.. డిస్ట్రిబ్యూటర్లకు గణనీయమైన లాభాలను వచ్చింది.. కాంతార సినిమా సీక్వెల్ వస్తుందని గతంలో ఈ సినిమా డైరెక్టర్ చెప్పారు. తాజాగా కాంతార 2 రావటం పక్క అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking Kanthara 2 movie coming on 2024
Breaking Kanthara 2 movie coming on 2024

కాంతార సినిమాను ఆస్కార్ తో పాటు పలు అవార్డుల వేడుకలకు పంపించమని నామినేషన్ కోసం వెయిట్ చేస్తున్నామని .. ఆ హడావుడి ముగిసిన తర్వాత కాంతర సినిమా సీక్వెల్ ను ప్రారంభించ బోతున్నట్లుగా మేకర్స్ అప్పట్లో తెలిపారు. రిషబ్ శెట్టి కాంతరా తరువాత హాలిడే ట్రిప్ లో ఎంజాయ్ చేశారు. తాజాగా అందుతున్న సమాచారం కంతార ను సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ప్రకారం ప్లాన్ చేస్తున్నారు.

 

 

చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన కాంతార సినిమాకు పార్ట్-2 రాబోతుంది.. సీక్వెల్ కాకుండా ఫ్రీక్వెల్ తెరకెక్కించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది.. రెండో భాగంలో హీరో తండ్రి జీవితం, ఆయన చనిపోయి ఎటు వెళ్లారు అనే అంశాలను చూపించబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం డైరెక్టర్ హీరో అయినా రిషబ్ శెట్టి కర్ణాటకలోని కోస్టల్ ప్రాంతానికి వెళ్లారట.

 

కాంతార పార్ట్ 2 ను 2024 లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమా కోసం కాంతారావు ఫాన్స్ ఈగరుగా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరో రెండు నెలలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.. అని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.