Komaram Bheemudo: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని కలెక్షన్లను వసూలు చేసింది. ఆస్కార్ బరిలో కూడా ఈ చిత్రం ఉంది.. ఈ సినిమా కి ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇటీవల ఈ సినిమాలోని నాటు నాటు పాటకి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది..
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి . ఈ సినిమాలో కొమరం భీముడు పాట ప్రతి ఒక్కరికి ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ముఖ్యంగా థియేటర్లో ఈ పాట వినేటప్పుడు ప్రతి ఒక్కరికి గూస్బంస్ వచ్చాయి.
అయితే కొమరం భీముడు పాట ను రాజమౌళి ఒక సినిమా కూడా కాపీ కొట్టరాట. కొమరం భీముడో పాట అయితే విడుదల అయిన వెంటనే ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. కీరవాణి గారు స్వరపరిచిన ఈ పాటని కాలభైరవ పాడారు. సినిమాలో ఈ పాట చూస్తున్నప్పుడు కూడా చాలా మంది ఎమోషనల్ అయ్యారు. కొమరం భీముడు పాటలోని సీన్స్ ఒక ఇంగ్లీష్ సినిమాలోని కొన్ని సీన్స్‌కి దగ్గరగా ఉన్నాయి.
ఈ పాటలోని సీన్స్ హాలీవుడ్ సినిమా అయిన ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక సినిమా లోని సీన్స్ కొన్ని ఒకే లాగా ఉన్నాయి. ఈ సినిమాకి మెల్ గిబ్సన్ దర్శకత్వం వహించారు. మెల్ గిబ్సన్ రాజమౌళికి ఇష్టమైన దర్శకులలో ఒకరు. మెల్ గిబ్సన్ సినిమాల్లో ఎమోషన్స్ చూపించే విధానం రాజమౌళికి చాలా ఇష్టం. అందుకే ఈ సినిమాలో కూడా అలాగే చూపించడానికి ప్రయత్నించారు.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళి కొమరం భీముడు సినిమాలోని పాట లోని సీన్స్ ఇంగ్లీష్ సినిమా నుంచి కాపీ కొట్టారని నెట్టింట చక్కర్లు కొడుతోంది..