Inaya: ఇనయా సుల్తానా.. పరిచయం అక్కర్లేని పేరు.. ఇనయా సుల్తానా పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు రాంగోపాల్ వర్మ.. అంతలా ఆయనతో మింగిల్ అయ్యి మెంటల్ మెంటల్ గా బిహేవ్ చేస్తుంది అంటూ ఆమె పై నెగిటివ్ టాక్ వినిపిస్తోంది.. రామ్ గోపాల్ వర్మ బ్యూటీ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ఇనయా సుల్తానా హౌస్ లో అడుగు పెట్టిన మొదటి నుంచి తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతూ స్ట్రాటజీలను అమలు చేస్తూ లాస్ట్ వరకు కొనసాగింది.. అయితే అనూహ్యంగా బయటికి వచ్చినా కూడా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. హౌస్ నుండి బయటకు వచ్చాక పలు ఆఫర్స్ తో బిజీ అయిపోతుందట. ఇనయా కి తాజాగా ఓ భారీ సంస్థకు గ్రీన్ ఇచినట్లు సమచారం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం ప్రకారం.. ఇనయా కు ప్రముఖ నిర్మాణ సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు.. అది పెద్ద సంస్థ కావడంతో యావరేజ్ ఇనయా పిలిచి అవకాశం ఇవ్వడానికి కారణం ఉందట. అదేంటంటే ఈ సినిమాలో ఆమె బోల్డ్ నెస్ ని ఎక్కువగా ప్రదర్శించాలట. ఇంకొక విషయం కూడా ఉంది.. ఈ బ్యూటీ హీరోయిన్ కాదు.. ఒకరకంగా చెప్పాలంటే సెకండ్ హీరోయిన్ అనుకోండి.. అయితే బోల్డ్ నెస్ లో మాత్రం పిచ్చిపిచ్చిగా రెచ్చిపోవాలట. ప్రముఖ నిర్మాణ సంస్థ కావడంతో ఇనయ కూడా నో చెప్పే ధైర్యం చేయలేనీ గట్టిగా టాక్ వినిపిస్తోంది.