VeeraSimha : ఈ డైలాగులకు థియేటర్లు బద్దలవుతున్నాయి .. వీరసింహా రెడ్డి నుంచి టాప్ 10 డైలాగ్స్ !

VeeraSimha: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం వీరసింహా రెడ్డి.. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌ షోతోనే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉందని ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. బాలకృష్ణ పవర్‌ఫుల్ యాక్టింగ్‌, థమన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఈ సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టింది. ఈ సినిమాలో బాలయ్య పలికిన కొన్ని డైలాగ్‌లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీశాయి. ఆ డైలాగ్స్ ఏంటో మీరు చూసేయండి..

Balakrishna Veera SimhaReddy movie power top 10 dailogues
Balakrishna Veera SimhaReddy movie power top 10 dailogues

1. సంతకం పెడితే బోర్డుపై పేరు మారొచ్చేమోగాని… చరిత్ర సృష్టించినవారి పేరు మారదు.. మార్చలేరు.. కోస్తా నాకొడకా..
2. పదవి చూసుకుని నీకు పొగరేమే.. బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువ..
3. మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్… నా జీవో గాడ్స్ ఆర్డర్..
4. ప్రగతి సాధించడం అబివృద్ది-ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ది- భిచ్చమేయడం కాదు. అభివృద్ధి పనులు ఆపడం అభివృద్ది కాదు. నిర్మించడం అభివృద్ది, కూల్చడం కాదు.. పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ది-ఉన్న పరిశ్రమలు మూసివేయడం అబివృద్ది కాదు.. అనే డైలాగ్‌లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
5. వీర సింహారెడ్డి.. ఆ పేరు వింటే వేట కొడవళ్ల వెన్నెముఖ వణుకుతుంది. భూమి మీద బతకడానికి అందరూ పుడతారు. కానీ భూమిని బతికించడానికి పుట్టిన సింహం.
6.కాపు కాసిన కర్నూలోళ్లు.. చుట్టుముట్టిన చిత్తూరోళ్లు.. కమ్ముకొస్తున్న కడపోళ్లు.. కత్తికట్టిన అనంతపురమోళ్లు.. ఎగసికొస్తున్నారు. ఎండనడినెత్తికి ఎక్కేలోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎరువేసి పోదాం.
7.ఎన్నివందల మందినైనా వెంటేసుకునిరా.. చివరి తల తెగేవరకూ కత్తి వదలను చేయి మార్చను. ఒంటిచేత్తో ఊచకోత కోస్తా నా కొడకా..
బాధ్యతగా చంపుతా.. మళ్లీ పుట్టడానికి మళ్లీ భయపడేట్టు చంపుతా..
8.అడవికి రాజు ఉంటుంది.. మృగాలన్నింటినీ కంట్రోల్‌లో పెట్టి అడవిని పాలిస్తుంది. ఆ రాజు పేరు సింహం.
9. వాళ్లు ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు.. గౌరవించడం మన బాధ్యత
10. ఇది రాయల సీమ.. రాయల్ సీమా.. గజరాజులు నడిచిన దారిలో గజ్జకుక్కలు కూడా నడుస్తుంటాయి.. రాజుని చూడు కుక్కని కాదు.
11. ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి.. ప్రజల్ని వేధించడం కాదు.. జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. బిచ్చమేయడం కాదు.. పని చేయడం అభివృద్ధి.. పనులు ఆపడం కాదు.. నిర్మించడం అభివృద్ధి.. కూల్చడం కాదు.. పరిశ్రమలను తీసుకుని రావడం అభివృద్ధి.. ఉన్న పరిశ్రమలను మూయడం కాదు. బుద్ధి తెచ్చుకో అభివృద్ధికి అర్థం తెలుసుకో..
12. వాడు దోచుకోవడానికి వచ్చాడు.. నాట్ అలౌడ్..
13. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర స‌ృష్టించిన వాడి పేరు మారదు. మార్చలేరు. బలం చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువా
14. మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మీసం కాదురా బచ్చా
సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని.. నేనొక్కడినే కత్తి పట్టా.. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు.. ముందు తరాల కోసం. నాది ఫ్యాక్షన్ కాదు.. సీమపై ఎఫెక్షన్.